హెన్నా, గోరింటాకులు కాదు.. కొత్తిమీర జుట్టుకు పెడితే ఏమౌతుందో తెలుసా?
హెన్నాలు, గోరింటాకులు కాకుండా.. కొత్తిమీర జుట్టుకు పెడితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం…
జుట్టు ఆరోగ్యంగా,అందంగా కనపడటం కోసం మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హెన్నాను రెగ్యులర్ గా జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ధృఢంగా మారుతుందని నమ్ముతారు. కానీ…. హెన్నాలు, గోరింటాకులు కాకుండా.. కొత్తిమీర జుట్టుకు పెడితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం…
కొత్తిమీర గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రకాల వంటల్లో కచ్చితంగా కొత్తిమీర వాడుతూ ఉంటారు. భోజనంలో కొత్తిమీర చేర్చడం వల్ల చాలా పోషకాలు మనకు అందుతాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. జుట్టు ఆరోగ్యానికి సహాయపడే సెబమ ఉత్పత్తిలోనూ సహాయపడతాయి. జుట్టును తేమగా ఉంచుకోవడానికి, మెరుస్తూ కనపడటానికి ఈ కొత్తిమీర చాలా బాగా సహాయపడుతుంది.
coriander
మరి, కొత్తిమీర జుట్టును జుట్టుకు అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం…
1.చుండ్రుకు చెక్…
కామన్ గా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు వస్తే జుట్టు చాలా బలహీనంగా మారుతుంది. చాలా అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. కొత్తిమీర ఆకులు జుట్టులోని చుండ్రును తొలగించడం, దాని యాంటీ ఫంగల్ లక్షణాలకు తగ్గించడంలో సహాయపడుతుంది. మీ జుట్టుకు దాని ప్రయోజనాలను పొందేందుకు, కొన్ని కొత్తిమీర ఆకులను మిక్సర్‌లో మెత్తగా పేస్ట్‌లా చేసి, మీ తలకు పట్టించాలి. అరగంట అలాగే ఉంచి కడిగేయండి. రెగ్యులర్ ఉపయోగం చుండ్రు, దురదను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
కొత్తిమీర ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కొత్తిమీర-ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ రెగ్యులర్ ఉపయోగం మీరు దానిని సాధించడంలో సహాయపడుతుంది. నూనెను సిద్ధం చేయడానికి, కొన్ని రోజులు కొబ్బరి నూనెలో కొన్ని కొత్తిమీర ఆకులను నానబెట్టి, ఆపై మీ తలకు వారానికి మూడుసార్లు మసాజ్ చేయండి. రెగ్యులర్ గా కొత్తిమీర నూనెను తలకు రాస్తూ ఉంటే.. జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయం చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించడం
కొత్తిమీర ఆకులు జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి సహజ పరిష్కారాన్ని అందిస్తాయి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ ఆకులు వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులను పెరుగు , తేనె కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసి.. దానిని జుట్టుకు పట్టిస్తే చాలు.. వారానికి రెండుసార్లు ఈ హెయిర్ మాస్క్ వాడినా.. మీరు కచ్చితంగా అనుకున్న ఫలితాలు పొందుతారు.