చలికాలంలో మొటిమల సమస్య.. వీటితో చెక్ పెట్టండి..!
జానికి, వింటర్‌లో చల్ల నీరు, చల్ల గాలులకి భయపడి రెగ్యులర్ గా యూజ్ చేసే ఫేస్ ప్యాక్స్ కి కూడా దూరంగా ఉంటాం. ఫలితం, స్కిన్ క్లీన్‌గా లేకపోవడం, తరువాత మొటిమల్స్ రావడం మొదలౌతాయి.
చలికాలం వచ్చిందంటే చాలు.. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎదో ఒకటి మొదలౌతుంది. చర్మం పొడిబారడం , పగుళ్లు లాంటివి వచ్చేస్తుంటాయి. అంతేకాదు.. చలికాలంలో ముఖ్యంగా మొటిమల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. ఫేస్ ఆయిలీగా తయారై పింపుల్స్ వస్తాయని. కానీ, పింపుల్స్‌కి ఆయిలీ స్కిన్ ఉండడం ఒక కారణం మాత్రమే.
అందుకే, యాక్నేకీ, సీజన్‌కీ సంబంధం లేదు. నిజానికి, వింటర్‌లో చల్ల నీరు, చల్ల గాలులకి భయపడి రెగ్యులర్ గా యూజ్ చేసే ఫేస్ ప్యాక్స్ కి కూడా దూరంగా ఉంటాం. ఫలితం, స్కిన్ క్లీన్‌గా లేకపోవడం, తరువాత మొటిమల్స్ రావడం మొదలౌతాయి.
మరి ఈ సమస్యను బయటపడటేం ఎలా అని అనుకుంటున్నారా..? కొన్ని రకాల ఆహారాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
1. ఆరెంజ్..
కొద్దిగా పుల్లగా, జ్యూసీగా ఉండే ఈ పండు ఈ సీజన్ లో విరివిగా లభిస్తుంది. రోజూ కనీసం ఒక పండు అయినా తినండి, లేదా ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ అయినా తాగండి. అప్పుడు టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయి మీ స్కిన్ లోపలి నుండి క్లీన్ అవుతుంది.
2. నట్స్
బాదంపప్పు, వాల్నట్స్, జీడి పప్పు, పిస్తా పప్పు - ఈ అన్ని నట్స్ లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హెల్దీ ఫ్యాట్స్. ఇవి చర్మపు పొరల్లో పేరుకుపోయిన అనారోగ్య కరమయిన ఆయిల్స్ ని తీసేసి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి. రోజుకి ఒక గుప్పెడు మాత్రమే తినాలని మరిచిపోకండి.
3. ఆకు కూరలు
శీతాకాలంలో ఆకు కూరలు బాగా దొరుకుతాయి. పాల కూర, క్యాబేజ్, మెంతి కూర - ఇలాంటి వన్నీ తెచ్చుకుని రోజూ కనీసం ఒకటైనా తినాలని నియమం పెట్టుకోండి. ఆకు కూరలు మీ స్కిన్ కి ఎంతో మేలు చేస్తాయి.
క్యారెట్, చిలగడ దుంప
విటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ స్వేద గ్రంధులని కుదించి, స్వేద రంధ్రాల సైజుని రెడ్యూస్ చేసి, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. క్యారెట్స్, చిలగడ దుంపల్లో విటమిన్ ఏ ఉంటుంది, పైగా అవి రెండూ ఈ సీజన్ లో బాగా ఫ్రెష్ గా దొరుకుతాయి కూడా.
గ్రీన్ టీ
చలి చలి గాలులలో వెచ్చని గ్రీన్ టీ ఇచ్చే ఆనందమే వేరు. సూర్యాస్తమయం కాగానే కొద్దిగా తేనె కలుపుకుని ఒక కప్పు వెచ్చని గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ యాక్నే ని దరి చేరనీయవు.