యానివర్సరీ ఆఫర్ ... కేవలం రూ.2 వేలకే విమాన ప్రయాణం
దేశీయ విమానయాన సంస్థ ఒకటి వార్షికోత్సవం సందర్భంగా టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఇచ్చింది. కేవలం రూ.2 వేలలోపు ఖర్చుతో ఈ సంస్థ విమానంలో దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఆ ఆఫర్ ఎప్పటివరకంటే...

Star Air
భారతదేశంలో విమాన ప్రయాణం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకప్పుడు కేవలం ధనవంతులకే అందుబాటులో వుండే విమాన సేవలు ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా చేరువయ్యాయి. ప్రయాణఛార్జీలు అందుబాటులో వుండటంతో మధ్యతరగతి ప్రజలు కూడా విమానాలు ఎక్కుతున్నారు. దీంతో విమానయాన సంస్థలు కూడా పోటీపడి డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇలా స్టార్ ఎయిర్ లైన్స్ తాజాగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
సంజయ్ ఘోడావత్ గ్రూప్ కు చెందిన స్టార్ ఎయిర్ తన ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. జనవరి 22 నుండి 29 వరకు సాధారణక్లాస్ ప్రయాణీకులు ₹1950 నుండి, బిజినెస్ క్లాస్ అయితే ₹3099 నుండి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Star Air Anniversary
డిస్కౌంట్ ముఖ్యాంశాలు
ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే చెల్లుతుంది. మొత్తం 66,666 సీట్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ సేల్ యొక్క ముఖ్యాంశాలు:
*ఏదైనా విమానానికి టికెట్ ధర ₹1,950 నుండి ప్రారంభం.
*బిజినెస్ క్లాస్ టిక్కెట్లను ₹3099 నుండి బుక్ చేసుకోవచ్చు.
*డిస్కౌంట్ ధరలతో బుకింగ్‌లు జనవరి 22 నుండి 29 వరకు తెరిచి ఉంటాయి.
*ప్రయాణం సెప్టెంబర్ 30 వరకు చెల్లుతుంది.
*ప్రత్యేక డిస్కౌంట్ అన్ని విమానాలకు వర్తిస్తుంది, సమయం లేదా వ్యవధి పరిమితులు లేవు.
*డిస్కౌంట్ 66,666 సీట్లకు పరిమితం చేయబడింది మరియు అవి బుక్ అయిన తర్వాత ముగుస్తుంది.
Star Air Anniversary
విమానయాన సంస్థ గర్వకారణం
స్టార్ ఎయిర్ డిస్కౌంట్ ప్రయాణికులకు వరం. ఢిల్లీ-ముంబై, చెన్నై-బెంగళూరు, చెన్నై-త్రివేండ్రం వంటి మార్గాల్లో ఎక్కువ ధరలున్నాయి. కానీ ఈ డిస్కౌంట్ తో సగం ధరకే ప్రయాణించవచ్చు.
స్టార్ ఎయిర్ CEO, కెప్టెన్ సిమ్రాన్ సింగ్ టివానా ఈ డిస్కౌంట్ గురించి స్పందించారు. ప్రయాణికులకు ఇంత తక్కువ ధరకే విమాన ప్రయాణం తమకు కూడా ఆనందాన్ని ఇస్తోందన్నారు. "విమానయానరంగంలో తమ ప్రయాణం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒకప్పుడు చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము" అని అన్నారు.
Star Air Anniversary
సురక్షిత ప్రయాణం
2019 నుండి ఈ స్టార్ ఎయిర్స్ 1.3 మిలియన్లకు పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలను చేర్చింది. ఈ వార్షికోత్సవ ఆఫర్లు తమను ఎంతో నమ్మిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపే మార్గమని స్టార్ ఎయిర్ యాజమాన్యం పేర్కొంది. తాము రోజురోజుకు విస్తరిస్తూ ప్రాంతీయ కనెక్టివిటీని పెంచుతున్నామని అన్నారు.
స్టార్ ఎయిర్ భారతదేశంలో సరసమైన విమాన ప్రయాణాన్ని అందించడంలో ముందుంటుందని CEO కెప్టెన్ సిమ్రాన్ సింగ్ పేర్కొన్నారు.భారతదేశంలోని టైర్-2 మరియు టైర్-3 నగరాలకు బడ్జెట్-స్నేహపూర్వక విమానాలను తీసుకురావడంపై దృష్టి పెడుతున్నామన్నారు.
ఈ విమానయాన సంస్థ ప్రారంభం నుండి ఆకట్టుకునే వృద్ధిని చూసింది. ముఖ్యంగా రెండు సంవత్సరాలలో కోల్హాపూర్-ముంబై మార్గంలో ప్రయాణీకుల రద్దీలో రికార్డు సాధించింది. తొమ్మిది విమానాలతో, ఎంబ్రెయర్ E175, ఎంబ్రెయర్ E145తో సహా, స్టార్ ఎయిర్ వంటి విమానాలతో సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది ఈ స్టార్ ఎయిర్.