రైలు రద్దైందా? ఎక్కడుంది? ఈ యాప్ తో చిటికెలో తెలిసిపోతుంది!
భారతీయ రైల్వేలలో టికెట్ బుకింగ్, రద్దు, అప్ డేట్, ట్రాకింగ్.. ఇప్పుడు ప్రతీదీ ఆన్లైన్ అయిపోయింది. యాప్ ల ద్వారా ప్రయాణికులు ఎప్పటికప్పడు సమాచారం తెలుసుకుంటున్నారు. తాజాగా భారతీయ రైల్వే రైలు సర్వీసుల రద్దుల గురించి సమాచారం కోసం NTES యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లో ఏయే ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.

భారతదేశంలో రైలు ప్రయాణం చాలా ముఖ్యం. దూర ప్రాంతాలకు సౌకర్యవంతంగా వెళ్లవచ్చని ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో టికెట్ బుక్ చేసుకుని వెళ్తుంటారు. దీనితో పాటు, టికెట్ లేకుండా సాధారణ రైళ్లలో కూడా లక్షలాది మంది ప్రయాణిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రైళ్లు ఆలస్యం కావడం, రూట్ మార్పు లేదా రద్దు కావడం సర్వసాధారణం. చివరి నిమిషంలో రైలు రద్దు అయితే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా భారతీయ రైల్వే ఒక యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో రైలు రద్దు, రూట్ మార్పుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
భారతీయ రైల్వే నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) యాప్ రైళ్ల స్థితి, రద్దు, రూట్ మార్పు, కొంతసేపు స్టేషన్‌లో ఆగడం వంటి వాటి గురించి సమాచారం ఇస్తుంది. ఈ యాప్‌ను మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనితో పాటు, NTES వెబ్‌సైట్ కూడా ఉంది.
NTES యాప్‌ను ఎలా ఉపయోగించాలి?" NTES యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, హోమ్ పేజీలో Spot Your Train, Live Station, Train Schedule, Train Between Trains, Train Exception Info అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకే క్లిక్‌తో మీకు కావలసిన అన్ని రైలు సమాచారం లభిస్తుంది.
Spot Your Train: ఈ ఆప్షన్‌లో మీ రైలు ఎక్కడుందో చూడవచ్చు. రైలు పేరు లేదా నంబర్ కొడితే రైలు ఎక్కడుందో తెలుస్తుంది. స్టేషన్ పేరు రాసినా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
Live Station: ఈ ఆప్షన్‌లో మీరు చెప్పే స్టేషన్ నుండి వచ్చే, బయలుదేరే రైళ్ల గురించి సమాచారం లభిస్తుంది. 2 నుండి 8 గంటల లోపు ఆ స్టేషన్ నుండి వెళ్లే ప్రతి రైలు వివరాలు ఇక్కడ ఉంటాయి.
Train Exception Info: ఇది చాలా ముఖ్యమైన ఆప్షన్. కొంతసేపు స్టేషన్‌లో ఆగి ఉన్న, రూట్ మార్చిన, రద్దైన రైళ్ల గురించి ఇక్కడ సమాచారం లభిస్తుంది. మీరు ప్రయాణం చేయాలనుకుంటే, ఆ రోజు ఏదైనా రైలు రద్దు అయిందా లేదా రూట్ మారిందా అని చూడవచ్చు. దీనితో పాటు, ఈ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రైళ్ల టైమ్ టేబుల్, స్టేషన్ల మధ్య నడిచే రైళ్ల జాబితా చూడవచ్చు.