MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tips
  • మీ ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు వుండట్లేదా..? వెంటనే ఇలా చేయండి... పక్కా రిజల్ట్

మీ ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు వుండట్లేదా..? వెంటనే ఇలా చేయండి... పక్కా రిజల్ట్

మీ ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు వుండట్లేదా...? బ్యాటరీ లైఫ్ దెబ్బతింటోందని భావిస్తున్నారు..? అయితే అందుకు కారణాలేంటో తెలుసుకొండి... వెంటనే సమస్యను పరిష్కరించుకొండి...

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 22 2024, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Phone Battery Life

Phone Battery Life

Phone Battery Life :  స్మార్ట్ ఫోన్... ఈ టెక్నాలజీ యుగంలో మనిషి జీవితంలోకి ప్రవేశించిన పవర్ ఫుల్ పరికరం. ఓ మనిషి జీవించాలంటే ఒకప్పుడు కూడు,గూడు, గుడ్డ తప్పనిసరి... కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి ఫోన్ కాదుకాదు స్మార్ట్ ఫోన్ వచ్చింది చేరింది. ఈ ఫోన్ వాడకానికి ధనవంతులు, పేదవారు అన్న తేడాలేదు... డబ్బున్నోళ్లు లక్షల విలువచేసేవి వాడితే... పేదోళ్ళు వేల విలువచేసేవి వాడతారంతే... కానీ స్మార్ట్ ఫోన్ వాడటం మాత్రం పక్కా. ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండానే పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు మొబైల్ కల్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఫోన్ లేదంటే మనిషి జీవితమే సాగదన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Phone Battery Life

Phone Battery Life

ఇలా స్మార్ట్ ఫోన్లపై మనిషి జీవితమే ఆదారపడింది... కాబట్టి ప్రతిఒక్కరు తమ ఫోన్ ఎప్పుడూ ఆన్ లోనే వుండాలని  కోరుకుంటారు. ఇంట్లో వున్నపుడు ఓకే...కానీ బయటకు వెళ్ళినపుడు సడన్ చార్జింగ్ అయిపోతే ఎలా..? ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి. కాబట్టి ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుండాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ చూస్తారు. 

311
Phone Battery Life

Phone Battery Life

మీ ఫోన్ ఛార్జింగ్ చిట్కాలు :    

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేసేది డిస్ ప్లే. ఒక్క మొబైల్స్ లోని కాదు ఎలక్ట్రానిక్ డివైజ్ లో ఛార్జింగ్ తగ్గడానికి ఎక్కువగా కారణమయ్యేది డిస్ ప్లే. కాబట్టి మీ ఫోన్ బ్రైట్ నెస్ వీలైనంత తక్కువగా పెట్టుకొండి. ముఖ్యంగా బయటకు వెళ్లిన సమయంలో చాలామంది ఫోన్ బ్రైట్ నెస్ పూర్తిగా పెంచుకుంటారు. అలా కాకుండా అవసరమైన సమయంలో మాత్రమే బ్రైట్ నెస్ పెంచుకుంటే బ్యాటరీ ఎక్కవసేపు వుంటుంది. 

411
Phone Battery Life

Phone Battery Life

ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించడం ఆపగానే ఆటోమేటిక్ గా స్క్రీన్ ఆఫ్ అవుతుంది. ఈ స్క్రీన్ ఆఫ్ సమయాన్ని వీలైనంత తక్కువ వుండేలా చూసుకొండి. దీనివల్ల ఛార్జింగ్ వృధాకాకుండా ఎక్కువసేపు వస్తుంది.
 

511
Phone Battery Life

Phone Battery Life

అవసరం వున్నా లేకపోయినా మన ఫోన్లలో లెక్కకుమించిన యాప్స్ వుంటాయి. అయితే కొన్ని యాప్స్ ఉపయోగించకున్నా మన బ్యాటరీని ఉపయోగిస్తుంటాయి. ఇలాంటి యాప్స్ అవసరం లేకుంటే వెంటనే డిలీట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే అనవసరమైన యాప్స్ అన్నింటిని మన మొబైల్ నుండి డిలీట్ చేస్తే మంచింది. ఇది సెక్యూరిటీ పరంగానే కాదు బ్యాటరీ లైఫ్ పరంగాను మంచింది. ఏ యాప్స్ ఎక్కువగా బ్యాటరీని ఉపయోగించాయో చూసుకునే ఆప్షన్ ప్రతి ఫోన్ లోనూ వుంటుంది.  ఓసారి చూసుకొండి. 
 

611
Phone Battery Life

Phone Battery Life

మనం ఫోన్ ఉపయోగించకున్నా బ్యాగ్రౌండ్ లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. దీంతో మనం ఫోన్ వాడకున్నా బ్యాటరీ తగ్గుతూ వుంటుంది. ఇలా మీ ఫోన్ లో కూడా జరుగుతుంటే వెంటనే బ్యాగ్రౌండ్ లో రన్ అయ్యే అప్లికేషన్లను నిలిపివేయండి. 

711
Phone Battery Life

Phone Battery Life

ఇక మీరు వాడే ఛార్జర్ ను బట్టికూడా బ్యాటరీ పనితీరు ఆధారపడి వుంటుంది. చాలామంది చేసే తప్పు ఏమిటంటే...అందుబాటులో ఏ ఛార్జర్ వుంటే దాంతో ఛార్జింగ్ చేస్తుంటారు. ఇలా చేయడంవల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. కాబట్టి మన ఫోన్ తో పాటు వచ్చే చార్జింగ్ ను వాడటంవల్ల బ్యాటరీ లైఫ్ బావుండి ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు వుంటుంది. 
 

811
Phone Battery Life

Phone Battery Life

స్మార్ట్ ఫోన్లలో పవర్ సేవింగ్ మోడ్ అనే ఆప్షన్ వుంటుంది... కానీ దాన్ని మనం బ్యాటరీ తక్కువగా వున్న సమయంలోనే వాడతాం. అలాకాకుండా ఎప్పుడూ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ లో వుంచండి. ఇది బ్యాటరీ లైఫ్ ను మెరుగు పరుస్తుంది. 

911
Phone Battery Life

Phone Battery Life

ఇక మీ ఫోన్ లో చార్జింగ్ ఎప్పుడూ 20 శాతానికి తగ్గకుండా, 90 శాతానికి పెరగకుండా చూసుకొండి. ఇది మెయింటేన్ చేస్తే బ్యాటరీ లైఫ్ బావుంటుంది.  

1011
Phone Battery Life

Phone Battery Life

 ప్రస్తుతం 5జి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే 5జి ఉపయోగించడం ద్వారా కూడా ఎక్కువ పవర్ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం వున్నపుడు మాత్రమే 5జి స్పీడ్ ఉపయోగించి...మిగతా సమయంలో 4జి ఆన్ లో పెట్టుకొండి.

1111
Phone Battery Life

Phone Battery Life

ఇక చార్జింగ్ చేసే సమయంలో ఫోన్ ఉపయోగించడం మంచిది కాదు. అలాగే బాగా వేడి, బాగా చలి పరిస్థితుల్లోనూ ఫోన్ ఉపయోగం మంచిదికాదు. ఫోన్ హీటెక్కకుండా జాగ్రత్త పడాలి. వైబ్రేషన్ మోడ్ కంటే రింగ్ టోన్ మోడ్ తక్కువ బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇలా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మన ఫోన్ బ్యాటరీ లైఫ్ ను మెరుగుపర్చుకోవచ్చు. తద్వారా ప్రతిసారి పవర్ బ్యాంకులు, ఛార్జర్లు వెంటపెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం వుండదు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved