దివ్యాంగురాలితో యువతి శారీరకసంబంధం.. డబ్బులు కాజేసి.. కానిస్టేబుల్ తో పెళ్లి.. అడిగితే గూండాలతో దాడి చేయించి..
ఓ దివ్యాంగురాలితో స్నేహం చేసి.. శారీరకసంబంధం పెట్టుకుని.. ఆమె దగ్గరున్న రూ.35 లక్షలు కాజేసిందో యువతి. ఆ తరువాత వేరే వ్యక్తితో వివాహం చేసుకుంది. అడిగిన దివ్యాంగురాలిని గూండాలతో కొట్టించింది.
జగిత్యాల : ఓ యువతితో మరో యువతి శారీరక సంబంధం పెట్టుకుంది. కొద్దికాలం సహజీవనం చేసింది. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు అన్నింటిని తీసుకుని.. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని బాధిత యువతి నిలదీయగా.. తమ సంబంధాన్ని సమాజం అంగీకరించదు.. కాబట్టి తన భర్త లేని సమయంలో.. ఆ యువతీతో ఉంటానని చెప్పి మాయ చేసింది. ఆ తర్వాత మొహం చాటేయడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
విచిత్రమైన ఈ కేసులో మోసపోయింది ఓ దివ్యాంగురాలైన యువతి. ఆమె దగ్గర నుంచి రూ. 35 లక్షల వరకు కాజేసి.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇంకో యువతి. దీంతో జగిత్యాల జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ కేసు నమోదు చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం బాల్కొండ గ్రామానికి చెందిన ఓ యువతి వికలాంగురాలు. తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. ఆమె ఓ కిరాణా షాపు పెట్టుకొని జీవిస్తోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో వచ్చిన డబ్బులు తన దగ్గర పెట్టుకుంది. అదే గ్రామానికి చెందిన నర్మద అన్న యువతి ఇది గ్రహించింది.
మెల్లిగా ఆ వికలాంగురాలైన యువతితో స్నేహం చేసుకుంది. ఆ తర్వాత ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. ఆమెకు మాయ మాటలు చెప్పి విడతల వారీగా ఆమె దగ్గరున్న డబ్బులను కాజేసింది. రూ.11.70 లక్షలు ఫోన్ పేతో.. మరో రూ.23.30 లక్షలు నగదుగా తీసుకుంది.
కొద్ది రోజులకు నర్మద ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. కానిస్టేబుల్ అయిన మరో వ్యక్తితో వివాహం చేశారు. ఇది తెలిసిన వికలాంగ యువతి నర్మదను నిలదీసింది. నా భర్త లేని సమయంలో నీ దగ్గరికి వస్తానని నర్మద నమ్మించింది.
దీంతో ఆ వికలాంగ యువతి నర్మద పెళ్లిలో తులం బంగారం కట్నంగా కూడా చదివిపించింది. పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత నర్మదా మొహం చాటేసింది. ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అసలు విషయం అర్థమైన వికలాంగ యువతి తన డబ్బులు తనకు ఇచ్చివేయాలంటూ నర్మద మీద ఒత్తిడి తెచ్చింది.
Crime
దీంతో కోపానికి వచ్చిన నర్మద శుక్రవారం నాడు వికలాంగ యువతి మీద ఆరుగురు గుండాలతో దాడి చేయించింది. ఇది గమనించిన స్థానికులు గాయపడ్డ వికలాంగ యువతిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాస్త కోలుకున్న తర్వాత ఆమె జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ కు శక్రవారం నాడు ఫిర్యాదు చేసింది.