- Home
- Telangana
- BJP: జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు వీరే.. అందరి చూపు బీజేపీ టికెట్ వైపే.!
BJP: జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు వీరే.. అందరి చూపు బీజేపీ టికెట్ వైపే.!
BJP: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్ధిగా మాగంటి సునీతకు ఛాన్స్ ఇవ్వగా.. కాంగ్రెస్ తమ అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌ను ప్రకటించింది. మరి బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమరం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికకు రంగం సిద్దమైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ సీటును ఎలాగైన గెలవాలని అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్, బీజేపీ తమ అస్త్రశ్రస్తాలను సిద్దం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్ధి ప్రకటన..
తమ స్థానాన్ని నిలుపుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్ధిని ప్రకటించిన విషయం తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకే అవకాశం ఇచ్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇక కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్‌కు బలమైన పోటీ ఇచ్చేందుకు తమ అభ్యర్ధులను ఎంచుకునే పనిలో పడ్డాయి.
బైపోల్ టికెట్ నవీన్ యాదవ్‌కే..
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్‌ను నవీన్ యాదవ్‌కు ఇచ్చింది. బొంతు రామ్మోహన్ రేసు నుంచి తప్పుకోవడం.. అలాగే యాదవ్ సామజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్‌కు లోకల్ లీడర్ల మద్దతు ఉండటంతో.. ఆయనను తమ అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఇటీవల నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.
నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు..
కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా.. ఓటర్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు నవీన్ యాదవ్. ఈసీ నిబంధనలు ఉల్లఘించి ఈ కార్యక్రమం చేపట్టారని.. ఇది ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించాలని మధురా నగర్ పోలీసులకు ఎన్నికల అధికారి రజినీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బీజేపీ అభ్యర్ధిపై ఉత్కంఠ
బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ప్రకటించేశాయి. ఇప్పుడు అందరి చూపు బీజేపీ వైపే ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్‌ను తమ అభ్యర్ధిగా బీజేపీ ఎవరిని నిలబెడతారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోటీలో దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి, మాధవీలత, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ వంటి నేతలు ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు పేర్లు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి బీజేపీ అధినయత్వానికి చేరాయని తెలుస్తోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లో బీజేపీ అభ్యర్ధి పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.