MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana Weatherman : ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు?

Telangana Weatherman : ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు?

IMD (భారత వాతావరణ శాఖ) ముందుగానే వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తుందంటే దానికి ఓ ప్రత్యేక వ్యవస్థ, హైటెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ఓ వ్యక్తి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించకుండా ఈ పని చేస్తే..? తెలంగాణ వెదర్ మ్యాన్ ఇదే చేస్తున్నాడు.

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 26 2026, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ వెదర్ మ్యాన్ మామూలోడు కాదు గురూ..!
Image Credit : X/Telangana Weatherman

తెలంగాణ వెదర్ మ్యాన్ మామూలోడు కాదు గురూ..!

Telangana Weatherman : టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో మన పూర్వీకులు ఆకాశంవైపు చూసి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేవారు. ఎప్పుడు ఎండ ఉంటుంది? ఎప్పుడు వర్షం పడుతుంది? అనేది కచ్చితంగా చెప్పేవారని కథలు కథలుగా చెప్పడం విన్నాం. ముఖ్యంగా రైతులు పంటలు కాపాడుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడేది. ఇప్పుడు కూడా సరిగ్గా ఇదే పని చేస్తున్నాడో తెలుగు కుర్రాడు. తెలంగాణ వెదర్ మ్యాన్ పేరిట రాష్ట్ర వాతావరణ సమాచారాన్ని అందిస్తున్న కుర్రాడి గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్?
Image Credit : X/Daripally Raja Shekhar Reddy

ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్?

టి. బాలాజి అంటే ఎవరూ గుర్తుపట్టరు... కానీ తెలంగాణ వెదర్ మ్యాన్ గా లక్షలాదిమంది తెలుగోళ్లకు పరిచయం ఈ కుర్రాడు. హైదరాబాద్ లో నివాసముండే బాలాజి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. చిన్నప్పటినుండే ఇతడు నేచర్ ను ఎంతో ఇష్టపడేవాడు.. అందుకే వాతావరణ మార్పులను పరిశీలించడం అలవాటయ్యింది. ఇదే అతడిని ఇప్పుడు తెలంగాణ వెదర్ మ్యాన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఓవైపు వాతావరణానికి సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో నేర్చుకుంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తున్నాడు బాలాజీ. ఇలా ఒకేసారి వాతావరణ నిపుణుడిగా, డిగ్రీ పట్టభద్రుడిగా మారాడు. ఇటీవలే హైదరాబాద్ లోని జవహార్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (JNTU) నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బిటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువులు కొనసాగిస్తూనే వెదర్ ను స్టడీ చేస్తూ ప్రజలకు ఫ్రీగా సమాచారం అందిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనవంతుగా సమాజ సేవ చేస్తున్నానని... ఈ వెదర్ రిపోర్ట్ అందించి డబ్బులు సంపాదించాలనే ఆలోచన తనకు లేదని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నాడు.

35
వెదర్ మ్యాన్ వాతావరణ సమాచారం ఎలా సేకరిస్తాడు...?
Image Credit : X/ Ramoojii Tarini

వెదర్ మ్యాన్ వాతావరణ సమాచారం ఎలా సేకరిస్తాడు...?

తెలంగాణ వెదర్ మ్యాన్ గా గుర్తింపుపొందిన బాలాజీ వద్ద ఎలాంటి అత్యాధునిక పరికరాలు లేవు. అయినా అతడు IMD (భారత వాతావరణ సంస్థ) లాంటి ప్రభుత్వ సంస్థల మాదిరిగా కచ్చితమైన సమాచారం అందిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అవుతుందో బాలాజీయే వివరించాడు. చిన్నప్పటినుండి వాతవారణంపై తాను పెంచుకున్న అవగాహన, ఇతర సంస్థల సమాచారాన్ని బట్టి తాను వెదర్ ఎలా ఉంటుందో అంచనా వేస్తానని వెల్లడించాడు.

రెండు రకాల పద్దతుల్లో వాతావరణ సమాచారం సేకరిస్తాడట... ఒకటి గ్రౌండ్ అనాలిసిస్, రెండోది మోడల్ అనాలిసిస్. ఇలా రెండు పద్దతుల ద్వారా అందిన సమాచారాన్ని క్రోడీకరించి ఓ అంచనాకు వస్తానని బాలాజీ చెబుతున్నాడు. ఉదయం లేవగానే తన పని ప్రారంభం అవుతుందని.. పక్కా సమాచారం అని తెలుసుకున్నాకే ప్రజలకు సమాచారం అందిస్తానని అంటున్నారు. అందుకే తనను ప్రజలు ఇంతలా నమ్ముతున్నారని బాలాజీ అంటున్నాడు.

45
ఎమిటీ గ్రౌండ్ అనాలిసిస్, మోడల్ అనాలిసిస్?
Image Credit : X/ Ramoojii Tarini

ఎమిటీ గ్రౌండ్ అనాలిసిస్, మోడల్ అనాలిసిస్?

గ్రౌండ్ అనాలసిస్ అంటే వాతావరణం ఎలా ఉందో మన ఫీలింగ్, కంటిచూపుతో తెలుసుకోవడం అన్నమాట. ఆకాశంలో మేఘాల కదలిక, ఇతర పరిణాలమాలను చూస్తూ నిశితంగా పరిశీలించడం... ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, గాలివేగం వంటివి ఫీల్ అవడం ద్వారా ఆ రోజంతా వాతావరణం ఎలా ఉందో ఓ అంచనాకు రావచ్చు. ఇదే బాలాజీ కూడా చేసేది.

ఇలా కొంత సమాచారం వచ్చాక మరింత కచ్చితత్వం కోసం మోడల్ అనాలిస్ చేపడతాడట బాలాజీ. శాటిలైట్, రాడార్ ఇమేజెస్ చెక్ చేసుకోవడం... ఇంటర్నేషనల్, నేషనల్ ఏజెన్సీ సైట్స్ ఫాలోఅవడం... GFS, ECMWS, JMA, UM, GDAPS వంటి సంస్థల సమాచారాన్ని అనాలిసిస్ చేయడం ద్వారా వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేస్తానని చెబుతున్నాడు. ఇలా గ్రౌండ్ అనాలిసిస్, మోడల్ అనాలిసిస్ ద్వారా అందిన సమాచారంలో ఓ డేటా రెడీ చేసి తెలంగాణ వెదర్ మ్యాన్ పేరిట క్రియేట్ చేసిన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు అందిస్తానని టి. బాలాజీ చెబుతున్నాడు.

55
తెలంగాణ వెదర్ మ్యాన్ లో ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..
Image Credit : X/ Ramoojii Tarini

తెలంగాణ వెదర్ మ్యాన్ లో ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..

వాతావరణం గురించి కచ్చితమైన సమాచారం అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు బాలాజీ. అతడి అందించే సమాచారం కోసం తెలంగాణ వెదర్ మ్యాన్ సోషల్ మీడియా పేజీలను లక్షలాదిమంది ఫాలో అవుతున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ వాట్సాప్ ఛానల్లో ఏకంగా 2.4 మిలియన్స్ అంటే 2,458,909 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఎక్స్ లో కూడా 181.1K (1,81,100) ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సమాచారం అందించేవారు చాలామందే ఉన్నారు... కానీ బాలాజీకి ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికీ లేదు.

వాతావరణాన్ని అంచనా వేయడానికి చాలా వర్క్ చేస్తానని చెబుతున్నాడు బాలాజీ. తనకు అందిన సమాచారాన్ని టైమ్ లాగ్ లేకుండా ప్రజలకు అందిస్తానని... దీంతో ఆ పరిస్థితులకు తగ్గట్లుగా ముందుగానే జాగ్రత్తపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీగా తాను ఈ పని చేస్తున్నానని... ప్రభుత్వం సాయం చేస్తే మరింత యాక్టివ్ గా వెదర్ రిపోర్ట్ ఇస్తానని అంటున్నాడు టి. బాలాజీ అలియాస్ తెలంగాణ వెదర్ మ్యాన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Ant Milk : చీమలు పాలు ఇస్తాయా? వీటిని సేకరించవచ్చా?
Recommended image2
Snake Alert App : ప్రమాదకర పాముల జాడను గుర్తించే యాప్.. ఇది మొబైల్ ఉంటే మీరు సేఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved