MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Snake Alert App : ప్రమాదకర పాముల జాడను గుర్తించే యాప్.. ఇది మొబైల్ ఉంటే మీరు సేఫ్

Snake Alert App : ప్రమాదకర పాముల జాడను గుర్తించే యాప్.. ఇది మొబైల్ ఉంటే మీరు సేఫ్

వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.. అవి నేరుగా జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇలాంటి టైంలో పాముల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ ఫోన్ లో ఓ యాప్ ఉంటే పాముల నుంచి రక్షణ పొందవచ్చు... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 26 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాకాలంలో పాములతో జాగ్రత్త
Image Credit : Gemini AI

వర్షాకాలంలో పాములతో జాగ్రత్త

వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుంటాయి... దీంతో పాములు ఉండే పుట్టలు, కన్నాలు నీటితో నిండిపోతాయి. అందుకే పాములు సురక్షితమైన, వెచ్చని ప్రదేశాల కోసం బయటకు వస్తాయి. ఈ కారణంగానే వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక వర్షాల కారణంగా ఇళ్లచుట్టూ గడ్డిపెరుగుతుంది... కాబట్టి తమ నివాసాన్ని కోల్పోయిన పాములు ఇందులోకి చేరతాయి... అక్కడి నుండి కిటికీలు, గోడలకు ఉండే రంధ్రాల ద్వారా ఇళ్లలోకి చేరుతుంటాయి. కాబట్టి వర్షకాలంలో పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పట్టణాలతో పోలిస్తే పల్లెటూర్లలో వర్షాకాలంలో పాముల బెడద మరీ ఎక్కువ. ఇంటి బయట పెట్టిన షూలలో పాములు వెచ్చదనం కోసం దూరి ఉంటాయి. షూ లోపల ఉన్న పాము కరిచి చనిపోయిన ఘటనలు మనం చాలానే చూశాం, చదివాం. అందుకే వర్షాకాలంలో పాముల నుంచి రక్షణ పొందడానికి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాముల నుండి కాపాడే మొబైల్ యాప్
Image Credit : Gemini AI

పాముల నుండి కాపాడే మొబైల్ యాప్

ఓ మైబైల్ యాప్ మిమ్మల్ని పాముల నుంచి కాపాడుతుంది... వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయినా ఇది నిజం. మీ ఇంట్లోకి పాములు రాకుండా హెచ్చరించే టెక్నాలజీ వచ్చేసింది. పాముల గురించి హెచ్చరించడానికే ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ అందుబాటులో ఉంది. పాముల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి ఈ టెక్నాలజీ ఒక వరం లాంటిది. ప్రజలు పాముల గురించి సమాచారం పొందడానికి, ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి. మరి మిమ్మల్ని పాముల నుంచి ఏ యాప్ కాపాడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Related Articles

Related image1
Snakes Farm : కోళ్ల ఫారం లాగే పాముల ఫారం.. లక్షల నాగుపాములు పెంచే ఈ ఒక్క విలేేజ్ ఆదాయం ఎంతో తెలుసా?
Related image2
Snakes : వర్షాకాలంలోనే పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి..?
35
ఏమిటీ బిగ్ 4 మ్యాపర్ యాప్.. ఎలా పనిచేస్తుంది?
Image Credit : Gemini AI

ఏమిటీ బిగ్ 4 మ్యాపర్ యాప్.. ఎలా పనిచేస్తుంది?

ఈ బిగ్ 4 మ్యాపర్ అనేది పాముల సమాచారం ఇచ్చే అప్లికేషన్లలో చాలా పాపులర్. దీని ప్రధాన ఫీచర్ మ్యాప్ ఆధారిత సిస్టమ్. యూజర్లు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు ఎక్కడ కనిపించాయో, ఏ ప్రాంతాలు ఎక్కువ ప్రమాదకరమో దీని ద్వారా చూడొచ్చు. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి, అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. 

పొలాల్లో పనిచేసే రైతులకు, అడవుల దగ్గర నివసించేవారికి, రాత్రిపూట బయటకు వెళ్లేవారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ జీపీఎస్ ఆధారిత లొకేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడాన్ని సులభం చేస్తుంది. ఇండియన్ స్నేక్ బైట్ ఇనిషియేటివ్' (Indian Snake Bite Initiative), 'ఇండియన్ స్నేక్స్' (IndianSnakes) సంస్థలు ఈ యాప్ ను అభివృద్ధి చేశాయి.

45
బిగ్ 4 మ్యాపర్ యాప్ లో పాముల వివరాలు
Image Credit : AI image

బిగ్ 4 మ్యాపర్ యాప్ లో పాముల వివరాలు

చాలా మంది అన్ని పాములూ విషపూరితమైనవే అని నమ్ముతారు. కానీ పాములలో విషసర్పాలు ఉన్నాయి, విషం లేనివి కూడా ఉన్నాయి... చాలామంది వాటిని గుర్తించడంలో విఫలమవుతారు. ఈ బిగ్ 4 మ్యాపర్ యాప్ పాముల గురించి సరైన సమాచారం ఇవ్వడమే కాకుండా, ఏది విషపూరితమైనదో, ఏది కాదో వివరిస్తుంది. ఈ యాప్‌లో వివిధ రకాల పాముల ఫోటోలు, వాటి వివరాలు ఉంటాయి. ఇది పాములను సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది.

బిగ్ 4 మ్యాపర్ యాప్ ఎక్కువగా భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషపూరిత పాములపై దృష్టి పెడుతుంది. వీటిలో నాగుపాము (Cobra), కట్లపాము (Common Krait), రక్తపింజర (Russell's Viper), గొలుసు పింజర (Saw-scaled Viper) ఉన్నాయి. దేశంలో అత్యధిక పాముకాటు మరణాలకు ఈ జాతులే కారణం.

55
పాము కరిస్తే వెంటనే ఏ చేయాలో తెలుసుకొండి.
Image Credit : Getty

పాము కరిస్తే వెంటనే ఏ చేయాలో తెలుసుకొండి.

ఒకవేళ పాము కరిస్తే, ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ బిగ్ 4 మ్యాపర్ యాప్ వెంటనే సలహా ఇస్తుంది. అలాంటి సమయాల్లో ప్రజలు వెంటనే వైద్య సహాయం పొందడానికి, సరైన ప్రథమ చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోడానికి ఈ యాప్ సహాయపడుతుంది. 

బిగ్ 4 మ్యాపర్ వంటి యాప్‌లతో పాటు పలు రాష్ట్రాలు పాములు కనిపించిన సమాచారాన్ని నేరుగా అధికారిక స్నేక్ రెస్క్యూ టీమ్‌లకు, అటవీ శాఖ సిబ్బందికి చేరవేసే వ్యవస్థలను కూడా అభివృద్ధి చేశాయి. ఇది పామును సురక్షితంగా పట్టుకుని, రక్షించడానికి వీలు కల్పిస్తుంది… ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే
Related Stories
Recommended image1
Snakes Farm : కోళ్ల ఫారం లాగే పాముల ఫారం.. లక్షల నాగుపాములు పెంచే ఈ ఒక్క విలేేజ్ ఆదాయం ఎంతో తెలుసా?
Recommended image2
Snakes : వర్షాకాలంలోనే పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved