MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Folk Song : 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్ కి కోట్ల వ్యూస్.. మంగ్లీతోనే మాస్ స్టెప్పులు వేయించిన ఈ సింగర్ నాగవ్వ ఎవరు..?

Folk Song : 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్ కి కోట్ల వ్యూస్.. మంగ్లీతోనే మాస్ స్టెప్పులు వేయించిన ఈ సింగర్ నాగవ్వ ఎవరు..?

Telangana Folk Songs : ఆమె గొంతులో తెలంగాణ జానపదం వినిపిస్తే చాలు… అది యూట్యూబ్ లో దుమ్ము రేపాల్సిందే. ఆమె ఎవరో కాదు… బాయిలోనే బల్లి పలికే పాటపాడిన నాగవ్వ. ఇంతకీ ఎవరీమె..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 10 2026, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న నాగవ్వ...
Image Credit : Screenshots to Speaker Youtube Channel

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న నాగవ్వ...

Telangana Folk : మట్టిలోని మాణిక్యాలను వెతికి పట్టుకుంటే అద్భుతాలు చేయవచ్చని ఇప్పటికే పలువురు పల్లెటూరి మహిళలు నిరూపించారు. మై విలేజ్ షో ద్వారా గుర్తింపుపొందిన గంగవ్వ ఏకంగా సినిమాల్లో నటించేస్థాయికి చేరారు, బిగ్ బాస్ కు వెళ్లారు. ఇక ఫోక్ సింగర్ కనకవ్వ వంటివారు కూడా అచ్చతెలంగాణ యాసలో పాడిన పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఇదే కోవలో నాగవ్వ చేరారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బాయిలోనే బల్లిపలికే సాంగ్ తో నాగవ్వ ఫేమస్..
Image Credit : instagram

బాయిలోనే బల్లిపలికే సాంగ్ తో నాగవ్వ ఫేమస్..

తెలంగాణ జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు నాగవ్వ. ఇటీవల 'బాయిలోనే బల్లి పలికే..' సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులిపింది. మంగ్లీ అదిరిపోయే డ్యాన్స్ కు నాగవ్వ గొంతు తోడవడంతో ఈ పాట ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు 'మామిడీ కోనాలమీద మబ్బులేమొ నిలిచినాయి' అంటూ మరోసారి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది నాగవ్వ. ఆమె పాటకు తెలంగాణ ముద్దుగుమ్మ నాగదుర్గ డ్యాన్స్ తోడవడంతో ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో లక్షల వ్యూస్ సాధించి కోట్ల దిశగా దూసుకెళుతోంది.

Related Articles

Related image1
Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. 80 కోట్ల వ్యూస్ దాటిన తొలి తెలుగు జాన‌ప‌దం
Related image2
Nagadurga : ఈమె జానపద పాటలకు యూట్యూబ్ షేక్.. ఎవరీ నాగదుర్గ..? టాప్ 5 సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ ఎన్ని..?
35
ఎవరీ నాగవ్వ..?
Image Credit : Screenshots to HAMARA VILLAGES

ఎవరీ నాగవ్వ..?

జగిత్యాల జిల్లాలోని అంబారీపేటలో పుట్టారు నాగవ్వ. తండ్రి యక్షగానాలు చేసేవారు... ఆయనను చూస్తూ పెరిగిన ఈమెకు తెలంగాణ జానపదాలపై మక్కువ పెరిగింది. బతుకమ్మ పాటలు, ఇతర తెలంగాణ జానపద పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకునేది.

అయితే నాగవ్వ అత్తవారింటికి వెళ్లిన ఈ జానపద పాటలను వదల్లేదు. భర్త కూడా భజనపాటులు పాడేవాడు.. దీంతో నాగవ్వను అతడు ప్రోత్సహించేవాడు. ఇలా పుట్టినింట, మెట్టినింటా తెలంగాణ జానపదాలు వినిపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా గుర్తింపు పొందింది. పలు టీవీ షోలలో కూడా పాటలు పాడారు నాగవ్వ.

అయితే తెలంగాణ ఏర్పాటుతర్వాత బతకమ్మ పాటలకు బాగా క్రేజ్ పెరిగింది. దీంతో చిన్నప్పటినుండి ఇవే పాటలు పాడుతూ పెరిగిన నాగవ్వ కూడా అనేక పాటలు పాడారు. కానీ మంగ్లీతో కలిసి 'కొప్పూలోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ' అంటూ నాగవ్వ పాడిన పాట ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీంతో ఈమె గొంతుతో పాటు పేరు ప్రజల్లోకి వెళ్ళింది. అక్కడినుండి నాగవ్వ పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి.

45
నాగవ్వ టాప్ సాంగ్స్ ఇవే..
Image Credit : Instagram / Naga Durga

నాగవ్వ టాప్ సాంగ్స్ ఇవే..

నాగవ్వ ఇప్పటివరకు వందల పాటలు పాడారు... ఇందులో కొన్ని యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించాయి. ఇందులో మొదట చెప్పుకోవాల్సింది 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్. నాగవ్వ పాడిన ఈ పాట మంగ్లీ డ్యాన్స్ తో యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యింది. దీనికి ఇప్పటివరకు 11M అంటే 11,611,183 వ్యూస్ వచ్చాయి.

అయితే నాగవ్వకు బాగా పేరుతెచ్చిన పాట మాత్రం 'నా తిరుపతి రెడ్డి' సాంగ్. ఇది యూట్యూబ్ లో ఇప్పటివరకు 1.3M అంటే 1,392,322 వ్యూస్ సాధించింది. ఇక ఇటీవలే ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గతో జతకట్టిన నాగవ్వ 'మామిడీ కోనాల మీద' అంటూ పాడిన పాట యూట్యూబ్ లో అదరగొడుతోంది. కొద్దిరోజుల్లోనే ఈ సాంగ్ 251K అంటే 251,754 వ్యూస్ వచ్చాయి. ఈ పాట ప్రజల్లోకి బాగా వెళ్లింది... కాబట్టి మిలియన్స్ వ్యూస్ ఖాయంగా కనిపిస్తోంది.

55
 నాగవ్వకు అండగా కుటుంబం...
Image Credit : Screenshots to HAMARA VILLAGES

నాగవ్వకు అండగా కుటుంబం...

మారుమూలు గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు నాగవ్వ... ఏమీ చదువుకోలేదు... కానీ ఆమెకున్న జ్ఞాపకశక్తి అద్భుతం, చిన్నప్పుడే తండ్రి యక్షగానం చేస్తుంటే ఆ పాటలను అలవోకగా పట్టుకుని పాడేది. తర్వాత కూడా బతుకమ్మ, ఇతర తెలంగాణ జానపదాలను గుర్తుపెట్టుకుని గలగలా పాడేది. దీంతో నాగవ్వకు మంచి గుర్తింపు వచ్చింది.

అయితే తాను ఈ స్థాయికి రావడంవెనకు కుటుంబం సపోర్ట్ చాలా ఉందంటోంది నాగవ్వ. భర్తతో పాటు కొడుకులిద్దరూ ఎంతో ప్రోత్సహించారని...అందువల్లే ఇంతబాగా పాడుతున్నానని అంటున్నారు. తనకు ఇంత గుర్తింపు వచ్చిందంటే అది కేవలం కుటుంబంవల్లే అని నాగవ్వ ఆనందంలో చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
TGSRTC: ఇక‌పై బ‌స్సుల్లో పోకీరిల ఆట‌లు సాగ‌వు.. భ‌రోసా ప్రాజెక్ట్ ప్రారంభించిన తెలంగాణ ప్ర‌భుత్వం
Recommended image2
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Recommended image3
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Related Stories
Recommended image1
Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. 80 కోట్ల వ్యూస్ దాటిన తొలి తెలుగు జాన‌ప‌దం
Recommended image2
Nagadurga : ఈమె జానపద పాటలకు యూట్యూబ్ షేక్.. ఎవరీ నాగదుర్గ..? టాప్ 5 సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ ఎన్ని..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved