MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Weather Update: మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆరెంజ్ అలెర్ట్

Weather Update: మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆరెంజ్ అలెర్ట్

Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 27 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పారాదీప్ వద్ద తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు
Image Credit : Gemini

పారాదీప్ వద్ద తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉనప్పటికీ, ఇది మరింత ఊపందుకొని తీవ్రవాయుగుండంగా మారే ఛాన్స్ వుంది. సోమవారం మధ్యాహ్నం నాటికి పారాదీప్ వద్ద తీరాన్ని దాటనుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వాతావరణం కూల్ అయిపోయి, పలు జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్
Image Credit : Gemini AI

హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాధాపూర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో పడుతున్న వానకు గ్రేటర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే టైమ్‌లో వాన పడటంతో మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ పూర్తిగా స్లో అయిపోయింది.

నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అటు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, డిజాస్టర్ టీమ్స్ ఆల్రెడీ అలెర్ట్ అయి వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద క్లియర్ చేస్తున్నారు.

Related Articles

Related image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Related image2
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
35
జిల్లాల్లో పడుతున్న వానలు.. అత్యధికంగా ఎక్కడంటే?
Image Credit : Gemini

జిల్లాల్లో పడుతున్న వానలు.. అత్యధికంగా ఎక్కడంటే?

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో రికార్డు స్థాయిలో 7.6 సెంటీమీటర్ల వర్షం పడింది. నిర్మల్ జిల్లా పాక్పట్లలో 4.1, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 4, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 4, మహబూబాబాద్ జిల్లా గార్లలో 3.8, నిజామాబాద్ జిల్లా ఎర్గట్లలో 3.6, మెట్‌పల్లిలో 3.6, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌లో 3.3, మెదక్ జిల్లా మిన్పూర్‌లో 3.2, మంచిర్యాల జిల్లా పాలచెట్టులో 2.9 సెంటీమీటర్ల మేర వానలు పడ్డాయి. హైదరాబాద్‌ నగరంలో హయత్నగర్‌లో 2.7, పెద్దఅంబర్‌పేటలో 1.8, బండ్లగూడ, పసుమాములలో 1.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నిజామాబాద్ నగరాల్లోనూ ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.

45
నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
Image Credit : Gemini

నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అంచనాల ప్రకారం.. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు గట్టిగా పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చు. ఇక నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా విస్తారంగా చినుకులు పడతాయని ఐఎండీ చెబుతోంది. ఒకవైపు వర్షాలు పడుతున్నా, గాలిలో హ్యుమిడిటీ ఎక్కువ ఉండటంతో పగటిపూట ఉక్కపోత ఉంటోంది.

55
ఎగువన జోరు వానలు.. జూరాలకు పోటెత్తుతున్న వరద
Image Credit : Gemini

ఎగువన జోరు వానలు.. జూరాలకు పోటెత్తుతున్న వరద

మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం జూరాల జలాశయానికి 22,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఆలమట్టి ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 35 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం 10 గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి రిలీజ్ చేశారు. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.897 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి, దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Recommended image2
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image3
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Related Stories
Recommended image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved