MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...

Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...

February Weather : జనవరి ముగింపుతో దాదాపు చలికాలం ముగిసినట్లే. ఫిబ్రవరి వచ్చింది కాబట్టి చలి తగ్గి మెళ్లిగా ఎండలు మొదలవుతాయి. ఈ నెలలో వాతావరణం ఎలా ఉండనుందంటే..  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 02 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో ఎండా వాన..
Image Credit : summer weather

తెలుగు రాష్ట్రాల్లో ఎండా వాన..

Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం ఉంది... ఓవైపు చలి, మరోవైపు ఎండలు కొనసాగుతున్నాయి. ఇది చాలదన్నట్లు అప్పుడప్పుడు వర్షాలు పలకరిస్తున్నాయి. ఇలా కొన్నిప్రాంతాల ప్రజలు ఒకేసారి చలి, ఎండా, వాన పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ పరిస్థితుల మార్పు ప్రజలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కాబట్టి ప్రజలు ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

25
ఏపీలో కొనసాగుతున్న చలి
Image Credit : @chetansabnis/X

ఏపీలో కొనసాగుతున్న చలి

చలికాలం ముగింపుకు చేరుకుంది... అందుకే మెళ్లిగా ఎండలు మొదలవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అటు చలి, ఇటు ఎండలు కొనసాగుతున్నాయి. మన్యం ప్రాంతాల్లో ఇప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... జి. మాడుగులలో 8.2, అరకులో 9, చింతపల్లిలో 10, ముంచంగిపుట్టులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇదే సమయంలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి... నందిగామలో అత్యధికంగా 33.6 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే నడి వేసవిలో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు కంగారుపడుతున్నారు.

Related Articles

Related image1
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Related image2
IMD Rain Alert : తీరంవైపే దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ ఐదు తెలుగు జిల్లాల్లో వర్షాలు
35
తెలంగాణలో ఫిబ్రవరి వెదర్ అప్డేట్...
Image Credit : Getty

తెలంగాణలో ఫిబ్రవరి వెదర్ అప్డేట్...

ఇక  తెలంగాణ విషయానికి వస్తే ఫిబ్రవరి చివర్లో ఎండలు ముదిరే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 7 లేదా 8 వరకు చలిగాలులు కొనసాగుతాయని... ఉదయం, రాత్రులు 14-16 డిగ్రీలు, మధ్యాహ్నం మాత్రం 29-31 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఫిబ్రవరి 8 తర్వాత వాతావరణంలో కొంత మార్పు ఉంటుందని... ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు 16-17 డిగ్రీలు, మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు పైన ఉంటాయని వెల్లడించారు.

45
ఈసారి ఆలస్యంగా వేసవి..
Image Credit : Getty

ఈసారి ఆలస్యంగా వేసవి..

మొత్తంగా చూసుకుంటే ఈసారి ఎండలు కాస్త ఆలస్యంగా మొదలవనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని... అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించారు. అయితే వేసవిలో కూడా అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

55
ప్రస్తుతం తెలంగాణ వాతావరణం ఎలా ఉంది..?
Image Credit : Getty

ప్రస్తుతం తెలంగాణ వాతావరణం ఎలా ఉంది..?

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 10 డిగ్రీలకు పైనే  అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న (ఫిబ్రవరి 1, ఆదివారం) ఆదిలాబాద్ లో అత్యల్పంగా 13.5, మెదక్ లో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక హన్మకొండలో 17.5, రామగుండంలో 17.8, నల్గొండలో 17.8, ఖమ్మంలో 18, నిజామాబాద్ లో 18, మహబూబ్ నగర్ లో 18, భద్రాచలంలో 20.2 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 32.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పటాన్ చెరులో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక హయత్ నగర్ లో 15, రాజేంద్రనగర్ లో 15, హకీంపేటలో 17.2, దుండిగల్ లో 17.6, బేగంపేటలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అత్యధికంగా హకీంపేటలో 29.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇవాళ(జనవరి 2, సోమవారం) హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండి ఉంటుందని... రాత్రి పొగమంచు కురిసే అవకాశాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
తిరుపతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR SIT Investigation : ఫోన్ ట్యాపింగ్ సెగ.. 5 గంటల పాటు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం.. ఏం తేల్చారు?
Recommended image2
High speed trains: హైదరాబాద్‌కు హై స్పీడు రైళ్లు, ఇక ఆ నగరాలకు 2 గంటల్లో చేరిపోవచ్చు
Recommended image3
Now Playing
DCP Shilpavalli Statement on Koti Shooting Incident | 6Lakhs Robbery at SBIATM | Asianet News Telugu
Related Stories
Recommended image1
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Recommended image2
IMD Rain Alert : తీరంవైపే దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ ఐదు తెలుగు జిల్లాల్లో వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved