MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఇంకా అల్పపీడనాలు, వాయుగుండాల గండం పొంచివుందా..? అక్టోబర్ లోనూ అల్లకల్లోలం తప్పదా?

IMD Rain Alert : ఇంకా అల్పపీడనాలు, వాయుగుండాల గండం పొంచివుందా..? అక్టోబర్ లోనూ అల్లకల్లోలం తప్పదా?

IMD Rain Alert : రుతుపవనాలు నిష్క్రమించాయి… అంటే వర్షాకాలం ముగిసినట్లే. కానీ తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదల బొమ్మాళి వదల అంటూ పట్టుకున్నాయి. మరి అక్టోబర్ మొత్తం ఈ అల్లకల్లోలం తప్పదా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 15 2025, 06:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్టోబర్ లోనూ ఆగని వర్షాలు
Image Credit : Freepik

అక్టోబర్ లోనూ ఆగని వర్షాలు

IMD Rain Alert : భారతదేశం నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే అధికారికంగా నేటితో వర్షాకాలం ముగిసినట్లే... శీతాకాలం ప్రారంభమైనట్లే. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మరికొన్నిరోజులు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇలాంటి వాటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాయుగుండాల గండముందా?
Image Credit : X

వాయుగుండాల గండముందా?

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ అక్టోబర్ లో కూడా వర్షాలు కొనసాగుతాయని ఐఎండి చెబుతోంది. ఇప్పటికే ఏర్పడుతున్న వరుస ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇకపై కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే... బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు వంటివి ఏమైనా ఏర్పడితే భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికయితే మోస్తరు వర్షాలు మాత్రమే కొనసాగుతున్నాయి.

35
నేడు ఏపీలో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు (అక్టోబర్ 15, బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డిఎంఏ హెచ్చరించింది.

45
ఈ ఏపీ జిల్లాల్లో కూడా పిడుగులు
Image Credit : PTI

ఈ ఏపీ జిల్లాల్లో కూడా పిడుగులు

పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అందుకే వర్షసమయంలో చెట్లకింద, పెద్దపెద్ద హోర్డింగ్, తాత్కాలిక నిర్మాణాల వద్ద ఉంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. 

55
ఈ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు
Image Credit : Getty

ఈ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు

తెలంగాణలో కూడా బుధవారం ఉదయంవరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే అక్టోబర్ 15 సాయంత్రం నుండి అక్టోబర్ 16 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :14-10-2025 pic.twitter.com/hH2qKmOZKz

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 14, 2025

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
విశాఖపట్నం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
IMD Rain Alert : పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు ఆవర్తనాలు... ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved