టీపీసీసీ చీఫ్ పదవి: కాంగ్రెస్‌లో హీట్, ఢీల్లీకి కాంగ్రెస్ సీనియర్లు
First Published Dec 13, 2020, 2:23 PM IST
టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరిని ఎంపిక చేయనుందనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ నేతల నుండి అభిప్రాయ సేకరణ పూర్తైంది. ఠాగూర్ నివేదిక ఆధారంగా పీసీసీ చీఫ్ ఎంపికపై నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ పార్టీలో హీట్ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు కార్పోరేట్ స్థానాలకే పరిమితమైంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?