Home Rent: హైదరాబాద్‌లో ఇంటి అద్దె కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలున్న ప్రదేశాలివే
విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా రకరకాల కారణాలతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎంతో మంది హైదరాబాద్‌కు వస్తుంటారు. ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తుంటారు. మరి మంచి సదుపాయాలతో పాటు తక్కువ అద్దెకు ఇళ్లు లభించే ప్రదేశాలపై ఓ లుక్కేయండి.

షామీర్‌పేట్
హైదరాబాద్ ఉత్తర భాగంలో ఉన్న షామీర్‌పేట్ ప్రశాంత వాతావరణం, తక్కువ అద్దె ధరలకు పెట్టింది పేరు. ఇతర ప్రాంతాల మాదిరి ఐటీ కంపెనీలు కాకుండా, ఇక్కడ ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. విల్లాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లు వంటి వివిధ హౌసింగ్ ఆప్షన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులో ఉన్న సౌకర్యాలు:
విద్యాసంస్థలు: బిట్స్ పిలాని, నల్సర్ లా యూనివర్సిటీ
ఆసుపత్రులు: వైపీఎస్ హాస్పిటల్, మెడిసిటీ, ఆర్‌వీఎమ్.
అద్దె ధరలు:
1 BHK: రూ.10,000
2 BHK: ₹14,500
3 BHK: ₹26,400
కూకట్‌పల్లి
హైదరాబాద్ వాయువ్య భాగంలో ఉన్న కుకట్‌పల్లి ఐటీ ఉద్యోగులకు చాలా దగ్గరగా ఉంటుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు రాకపోకలు సులభంగా జరుగుతాయి. ఇక్కడ హై-రైజ్ అపార్ట్‌మెంట్‌లు, PGలు, కమర్షియల్ స్పేస్‌లు ఎక్కువగా ఉంటాయి.
అందుబాటులో ఉన్న సౌకర్యాలు:
విద్యాసంస్థలు: JNTU హైదరాబాద్‌తో పాటు అన్ని రకాల ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే అన్ని ప్రముఖ హాస్పిటల్స్, మాల్స్ ఉన్నాయి.
అద్దె ధరలు (ప్రతి నెలకు):
1 BHK: ₹15,000 – ₹26,000 (సగటు ₹20,166)
2 BHK: ₹12,000 – ₹30,000 (సగటు ₹21,000)
3 BHK: ₹30,000 – ₹40,000 (సగటు ₹35,000)
నాగోలు
తూర్పు హైదరాబాద్‌లో ఉన్న నాగోలు ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మెట్రో బ్లూ లైన్ కారణంగా రవాణా సౌకర్యం బాగా మెరుగైంది. ఉప్పల్, ఎల్‌బీనగర్, అమీర్‌పేట్ ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో ఉద్యోగులు, కుటుంబాలు ఇక్కడ ఎక్కువగా ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని ప్రముఖ విద్యా సంస్థలతో పాటు హాస్పిటల్స్ ఉన్నాయి.
అద్దె ధరలు (ప్రతి నెలకు):
1 BHK: ₹8,000 – ₹12,000 (సగటు ₹10,000)
2 BHK: ₹13,000 – ₹18,000 (సగటు ₹15,500)
3 BHK: ₹20,000 – ₹26,000 (సగటు ₹23,000)
అల్వాల్
సికింద్రాబాద్ కాంటోన్మెంట్ దగ్గరలో ఉన్న అల్‌వాల్ ప్రశాంత వాతావరణం, పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులు ఎక్కువగా ఇక్కడ నివసిస్తారు. ఇండిపెండెంట్ ఇళ్లు, చిన్న అపార్ట్‌మెంట్‌లు ఎక్కువగా లభ్యమవుతాయి. ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు మొదలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్న సుచిత్ర కూడా దగ్గరల్లోనే ఉంటుంది.
అద్దె ధరలు (ప్రతి నెలకు):
1 BHK: ₹7,000 – ₹10,000 (సగటు ₹8,500)
2 BHK: ₹11,000 – ₹16,000 (సగటు ₹13,500)
3 BHK: ₹17,000 – ₹24,000 (సగటు ₹20,000)
చందానగర్ (Chandanagar)
పశ్చిమ హైదరాబాద్‌లో ఉన్న చందానగర్, గచ్చిబౌలి, హైటెట్ సిటీ వంటి ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉంటుంది. రైల్వే స్టేషన్, రోడ్డు కనెక్టివిటీ బాగుండటంతో ఉద్యోగులు, కుటుంబాలు ఇక్కడ ఎక్కువగా ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. ఇండిపెండెంట్ ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదేశంలో అన్ని రకాల కార్పొరేట్ విద్యా సంస్థలు మొదలు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి.
అద్దె ధరలు (ప్రతి నెలకు):
1 BHK: ₹9,000 – ₹13,000 (సగటు ₹11,000)
2 BHK: ₹14,000 – ₹20,000 (సగటు ₹17,000)
3 BHK: ₹20,000 – ₹30,000 (సగటు ₹25,000)
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇంటి అద్దె తీసుకునే ముందు నేరుగా సంప్రదించి ఇంటి అద్దెను తెలుసుకుంటే మరింత క్లారిటీ వస్తుంది.