- Home
- Andhra Pradesh
- APPSC Jobs : నెలనెలా రూ.25,220 నుండి రూ.1,37,220 సాలరీ .. అక్టోబర్ లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాలివే
APPSC Jobs : నెలనెలా రూ.25,220 నుండి రూ.1,37,220 సాలరీ .. అక్టోబర్ లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాలివే
APPSC Jobs : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారిచేసింది. ఇందులో టాప్ 5 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల జాతర
APPSC Jobs : ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా 15,941 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది కూటమి ప్రభుత్వం.. అలాగే పోలీస్ శాఖలో 6100 పోస్టులను భర్తీచేశారు. ఇక మరికొన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ రంగంలో కూడా భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది... మొత్తంగా పాలనాపగ్గాలు చేపట్టిన ఈ 15 నెలల్లో ఏకంగా 4,71,574 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికన ప్రకటించారు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని స్పష్టం చేశారు.
మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లే ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC)తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థలు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సిద్దమయ్యాయి. ఇలా ఏపిపిఎస్సి చాలా ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీచేసింది... కొన్నింటికి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా మరికొన్ని ఉద్యోగాలకు ఈ నెల (అక్టోబర్) నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. కాబట్టి నిరుద్యోగ యువత ఏఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది? వాటికి కావాల్సిన అర్హతలేంటి? లాంటి ఫుల్ డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. అన్ని అర్హతలు కలిగి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్టోబర్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు
1. వార్డెన్ ఉద్యోగాలు (వికలాంగులు, ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 01
సాలరీ : రూ.40,970 నుండి రూ.1,24,380 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-10-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 28-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా ఏ సబ్జెక్ట్స్ లో అయినాసరే బ్యాచిలర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి. ఎంఏ (సోషల్ వర్క్) లేదా ఎంఏ (సోషియాలజీ) లేదా డిప్లోమా ఇన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో డిగ్రీ ఉండాలి. ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థల నుండి ఈ కోర్సులు పూర్తిచేసివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
2. అసిస్టెంట్ ఇన్స్ఫెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 03
సాలరీ : రూ.32,670 నుండి రూ.1,01,970 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-10-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 28-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ పూర్తిచేసివుండాలి. లేదంటే డిప్లోమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ ఆండ్ నావిగేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ పూర్తిచేసివుండాలి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇన్లాండ్ లేదా మెరైన్ ఫిషరీస్ క్లాసెస్ కు హాజరైన సర్టిఫికేట్ కలిగివుండాలి. బిఎఫ్ఎస్సి లేదా బిఎస్సి (ఎప్ జడ్ సి) లేదా బిఎస్సి (ఫిషరీస్) పూర్తిచేసివుండాలి. ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థల నుండి ఈ కోర్సులు పూర్తిచేసివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
3. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఆండ్ కరెక్షనల్ సర్వీసెస్)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 01
సాలరీ : రూ.25,220 నుండి రూ.80,910 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 25-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 15-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
4. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ఫెక్టర్ (ఏపీ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీస్)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 01
సాలరీ : రూ.48,440 నుండి రూ.1,37,220 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 25-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 15-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కలిగివుండాలి. మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగివుండాలి... భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
5. అసిస్టెంట్ ఇంజనీర్ (పలు ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 11
సాలరీ : రూ.48,440 నుండి రూ.1,37,220 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 25-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 15-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసివుండాలి. దీంతో పాటు పోస్టును బట్టి మరికొన్ని విద్యార్హతలు కలిగివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)