TVS Ntorq 150: మార్కెట్లోకి కొత్త స్కూటర్.. 150 సీసీతో పాటు కళ్లు చెదిరే ఫీచర్లు
టీవీఎస్ మోటార్స్ తమ అత్యంత శక్తివంతమైన Ntorq 150 స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 150cc స్కూటర్ సెగ్మెంట్‌లోకి ఈ కొత్త ఎంట్రీతో టీవీఎస్ పోటీని తీవ్రతరం చేసింది. ఈ స్కూటీకి సంబంధించిన పూర్తి వివరాలు.

డిజైన్‌లో కొత్త మార్పులు
Ntorq 150, 125 మోడల్‌తో పోలిస్తే మరింత షార్ప్ లుక్‌తో వచ్చింది. ముఖ్యంగా ముందుభాగంలో క్వాడ్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. 125 మోడల్‌లో ఉన్న ఏప్రాన్-మౌంటెడ్ డిజైన్‌కి భిన్నంగా ఈ కొత్త డిజైన్ మరింత స్పోర్టీ లుక్ ఇస్తోంది.
KNOW
అప్‌గ్రేడ్ ఫీచర్లతో
ఇప్పటికే Ntorq 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SmartXonnect యాప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు 150 మోడల్‌లో వీటికి తోడు 5 అంగుళాల TFT డిస్ప్లేను జోడించారు. అదనంగా మరిన్ని టెక్నాలజీ అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్, పనితీరు
Ntorq 150లో 150cc 3-వాల్వ్ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 13.2 HP పవర్, 14.2 Nm టార్క్ ఇస్తుంది. 0–60 km/h స్పీడ్‌ను కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుంది. గంటకు 104 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. ఇది Ntorq 125 (90 km/h)తో పోల్చితే గణనీయంగా ఎక్కువ. రేస్, స్ట్రీట్, iGo అసిస్ట్ బూస్ట్ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.
భద్రతా ఫీచర్లు
ఈ మోడల్‌లో ట్రాక్షన్ కంట్రోల్, ABS, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ ఉన్నాయి. ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. 12-అంగుళాల వీల్స్పై, ముందు 100/80 టైర్లు, వెనుక 110/80 టైర్లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్‌లో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సౌకర్యం అందించారు.
అదనపు ఫీచర్లు
Ntorq 150లో 2-లీటర్ల ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, అండర్-సీట్ USB ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ కిల్ స్విచ్ ఉన్నాయి. అలాగే ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ స్కూటర్‌ను మరింత అడ్వాన్స్‌గా తీర్చిదిద్దాయని చెప్పాలి.