డిఫెన్స్ - ఏరోస్పేస్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఎలా మారుతోంది?
Hyderabad: హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని తెలంగాణ రక్షణ, అంతరిక్ష రంగంలో భారత భవిష్యత్తును మరింతగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రయాణంలో గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భారత్ కు సరికొత్త టెక్ క్యాపిటల్ గా హైదరాబాద్
హైదరాబాద్ ఇప్పుడు కేవలం భారత ఐటీ రాజధాని మాత్రమే కాదు.. ఇది ఇప్పుడు దేశానికి ఢిఫెన్స్ - ఏరోస్పేస్ క్యాపిటల్‌గా ఎదిగింది. ఇక్కడి నుంచి రక్షణ, అంతరిక్ష సాంకేతిక భవిష్యత్తు రూపుదిద్దుకుంటోంది.
తెలంగాణాలో ప్రస్తుతం 12కి పైగా DRDO ల్యాబ్స్, అనేక రక్షణ పీఎస్యూలు, 25కి పైగా గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీలు, 1,000కి పైగా MSMEలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ దేశానికి మరో కొత్త పాత్రలో రాజధానిగా మారింది.
KNOW
హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీల భారీ పెట్టుబడులు
హైదరాబాద్ ప్రపంచ స్థాయి కంపెనీలకు నమ్మదగిన కేంద్రంగా మారింది. అందకే గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
• బోయింగ్–TASL సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అపాచీ హెలికాప్టర్ ఫ్యూజలేజెస్ తయారు చేస్తోంది.
• లాక్‌హీడ్ మార్టిన్–TASL కలిసి C-130J విమానాలకు ముఖ్యమైన ఎమ్పెనేజ్ భాగాలను నిర్మిస్తోంది. ఇది హైదరాబాద్ నుంచే గ్లోబల్ సప్లై అవుతోంది.
• సఫ్రాన్, GE సంస్థలు LEAP ఇంజిన్ భాగాలు, MRO హబ్‌లలో పెట్టుబడులు పెడుతున్నాయి.
• కాలిన్స్ ఏరోస్పేస్ 1,000కి పైగా ఇంజినీర్లతో నెక్స్ట్ జనరేషన్ అవియానిక్స్ డిజైన్ చేస్తోంది.
అంతరిక్ష రంగంలో తెలంగాణా స్టార్టప్‌లు
హైదరాబాద్ కేంద్రంగా అనేక భారత ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి.
• స్కైరూట్ ఏరోస్పేస్ – భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–S ప్రయోగం చేసి చరిత్ర సృష్టించింది.
• ధ్రువ స్పేస్ – అధునాతన ఉపగ్రహాలు, గ్రౌండ్ సిస్టమ్స్ అభివృద్ధి చేస్తోంది.
• MTAR టెక్నాలజీస్ – ISROకి propulsion టెక్నాలజీ అందిస్తోంది.
• అనంత్ టెక్నాలజీస్ – ఇప్పటివరకు 50కి పైగా లాంచ్‌లు, 100కి పైగా స్పేస్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌లో సహకరించింది.
తెలంగాణా భవిష్యత్ విజన్
హైదరాబాద్‌లో ఇప్పటికే 4 ఏరోస్పేస్ పార్కులు, 2 పెద్ద హార్డ్వేర్ పార్కులు, 50 ఇంజనీరింగ్ పార్కులు ఉన్నాయి. T-Works వంటి ప్రోటోటైపింగ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. NRSC, ARCI వంటి జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలు ఇక్కడ ఉండటం వల్ల సహకారం పెరుగుతోంది.
తెలంగాణా ఇప్పటికే Mars Orbiter Mission భాగాలలో 30% ఉత్పత్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం SpaceTechను ఉపయోగించి వ్యవసాయం, వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ప్రత్యక్ష ప్రయోజనాలు కలిగేలా ప్రోత్సహిస్తోంది.
రాష్ట్ర వ్యూహంలో నాలుగు కీలక అంశాలు
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటు – పరిశ్రమలకు అవసరమైన సదుపాయాల కల్పన.
బిజినెస్ సపోర్ట్ & సహకారం – గ్లోబల్ పెట్టుబడులు, భాగస్వామ్యాల కోసం అనుకూల వాతావరణం.
స్కిల్ డెవలప్‌మెంట్ – TASK ద్వారా యువతకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి.
రిసెర్చ్ & ఇన్నోవేషన్ – RICHతో భాగస్వామ్యంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
డిజిటల్ తెలంగాణ
స్పేస్‌టెక్‌తో పాటు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీస్ వంటి రంగాలలో కూడా తెలంగాణ ముందడుగు వేస్తోంది. "డిజిటల్ తెలంగాణా" లక్ష్యంతో ప్రభుత్వం ప్రజలకు డిజిటల్ సేవలు, అవకాశాలు అందిస్తోంది.