School Holidays : రేపు విద్యాసంస్థలకు సడన్ సెలవు ఇచ్చినట్లేగా..! ఎందుకో తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కారణంగా తెలంగాణ విద్యార్థులకు అనధికారిక సెలవు వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్లంతా సామూహిక సెలవు పెడుతున్నారు… అంటే విద్యార్థులకు సెలవే.

ఎందుకు సెలవు?
School Holidays : తెలుగు విద్యార్థులకు సడన్ గా మరో సెలవు వచ్చేసినట్లే... ఇది అనధికారిక హాలిడే. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోడానికి కారణమయ్యేలా ఉన్నాయి... రేపు (నవంబర్ 17, మంగళవారం) సెలవు వచ్చేలా ఉంది. అసలు ఉద్యోగులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? దీంతో విద్యార్థులకు సెలవు ఎలా వస్తుంది?
విద్యాసంస్థలకూ సెలవే..!
పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్దరించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. ఇప్పుడున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ను రద్దు చేయాలని వీరు కోరుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అందరు ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టేందుకు సిద్దమయ్యారు... ఈ మేరకు తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TGCPSEU) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగులు సెలవు కోసం అప్లై చేశారని తెలిపింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన పెన్షన్ హామీని అమలుచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమయ్యారు... అందుకే నవంబర్ 17న (మంగళవారం) అంటే రేపు ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇలా టీచర్ల మాస్ క్యాజువల్ లీవ్ కారణంగా విద్యార్థులకు అనధికారిక సెలవు రాబోతోంది. స్కూల్ యధావిధిగా నడుస్తుంది... టీచర్లంతా సెలవులో ఉంటారు కాబట్టి నడపడం కష్టం... నడిచినా పాఠాలు చెప్పేవారు ఉండరు కాబట్టి సెలవు అన్నట్లే. స్కూల్స్ నడుస్తాయి కానీ క్లాసులు ఉండవన్నమాట.
OPS vs CPS మధ్య తేడా ఏంటి?
పాత పెన్సన్ విధానం (OPS) ప్రకారం.. ఓ ప్రభుత్వ ఉద్యోగి పదవీవిరమణ పొందినా శాలరీ వస్తుంది. అతడు రిటైర్ అయ్యేటప్పుడు ఎంత శాలరీ పొందుతున్నాడో అందులో సగం (50 శాతం) శాలరీ జీవితాంతం వస్తుందన్నమాట. వీరి మరణం తర్వాత కుటుంబసభ్యులకు డబ్బులు వస్తాయి. ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయి.
అయితే ప్రస్తుత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ ద్వారా ఉద్యోగి పదవీవిరమణ తర్వాత నెలానెలా పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. ఒకేసారి ఉద్యోగికి డబ్బులు ఇచ్చేస్తారు. ఈ పెన్షన్ కోసం ఉద్యోగి శాలరీ నుండి కొంత డబ్బు కట్ అవుతుంది... పాత పెన్షన్ విధానంలో జీతంలో ఎలాంటి కోత ఉండేదికాదు. కొత్తదానికంటే పాత విధానమే బాగుండటంతో అదే కావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.









