- Home
- Andhra Pradesh
- School Holidays : ఇంకో నాల్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత మళ్లీ వరసగా రెండ్రోజులు సెలవులే
School Holidays : ఇంకో నాల్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత మళ్లీ వరసగా రెండ్రోజులు సెలవులే
ఈ వారంలో ఇంకా నాల్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది… తర్వాత వరుసగా రెండ్రోజులు సెలవులున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని విద్యాసంస్థలకు ఏరోజు, ఎందుకు సెలవుందో తెలుసా?

తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు
School Holidays : సాధారణంగా ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు సోమవారం స్కూల్ కి భారంగా వెళుతుంటారు విద్యార్థులు. అలాంటిది గత నెల రోజులుగా తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు వచ్చాయి... ఆంధ్ర ప్రదేశ్ లో అయితే దసరా సెలవులు ముగియగానే అర్నబ్, మురసు తుపానుల కారణంగా సెలవులు వచ్చాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సెలవులు కంటిన్యూ అయ్యాయి. తాజాగా దీపావళి పండక్కి చాలా విద్యాసంస్థలకు రెండ్రోజులు నవంబర్ 8, 9న (ఆదివారం, సోమవారం) సెలవులు వచ్చాయి.
అయితే తెలుగు విద్యార్థులకు దీపావళి సెలవులు ఇవాళ్టితో ముగిశాయి... రేపు (నవంబర్ 10) మంగళవారం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటాయి. కానీ ఓ నాల్రోజులు నడుస్తాయో లేదో మళ్లీ వరుసగా రెండ్రోజులు విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అంటే ఈవారం కేవలం నాల్రోజులే వర్కింగ్ డేస్ అన్నమాట. ఈ వీకెండ్ వరుస సెలవులు ఎందుకున్నాయో తెలుసా?
మళ్లీ రెండ్రోజుల సెలవులు
దీపావళి సెలవుల తర్వాత భారంగా స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ వారంలో కేవలం నాలుగురోజులు (మంగళ, బుధ, గురు, శుక్రవవారాలు) మాత్రమే స్కూళ్లు నడుస్తాయి... తర్వాత రెండురోజులు సెలవులున్నాయి.
ప్రతి నెలలో వచ్చే రెండో శనివారం ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవు ఉంటుంది. ఇలా ఈ నవంబర్ 14న రెండో శనివారం వస్తోంది... కాబట్టి సెలవు ఉంటుంది. ఇక నవంబర్ 15 ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. ఇలా రాబోయే వీకెండ్ వరుస సెలవులున్నాయి.
కార్తీక పౌర్ణమికి 3 రోజులు సెలవులు పొందే ఛాన్స్..
ఈవారం రెండో శనివారం, ఆదివారం రెండ్రోజులే సెలవులు.... కానీ ఆ తర్వాతి వారం వరుసగా మూడ్రోజులు సెలవులు పొందే ఛాన్స్ ఉంది. కార్తీక మాసంతో ఎంతో పవిత్రంగా భావించే పౌర్ణమి నవంబర్ 24 (మంగళవారం) వస్తోంది. ఈరోజు హిందూ దేవుళ్లు శివుడు, విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది భావిస్తారు... అందుకే ఆరోజు దేవాలయాలకు వెళ్లడం, ప్రజలు చేయడం చేస్తుంటారు. అంతేకాదు సిక్కుల ఆరాధ్యదైవం గురునానక్ జయంతి కూడా ఈరోజు. అందుకే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులకు ఆరోజు సెలవు ఉంటుంది.
నవంబర్ 22న ఆదివారం, నవంబర్ 24 గురుపౌర్ణమి రెండ్రోజులు సెలవులున్నాయి... మధ్యలో సోమవారం (నవంబర్ 23) మ్యానేజ్ చేయగలిగితే మూడ్రోజులు సెలవు పొందవచ్చు. అంటే ఈ ఒక్కరోజు లీవ్ పెడితే వరుసగా మూడ్రోజులు సెలవులే.
ఏపీలో పంచాయితీ ఎన్నికల సెలవులు..
ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ తో పాటు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు కూడా ముగిశాయి. ఇక మిగిలింది గ్రామ పంచాయితీ ఎన్నికలే. మూడు విడతల్లో రాష్ట్రంలోని అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసే విద్యాసంస్థలకు మళ్ళీ సెలవులు రానున్నాయి.
నవంబర్ 26న మొదటి విడత పోలింగ్ జరగనుంది... ప్రభుత్వ పాఠశాలల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు... కాబట్టి ఈరోజు ఆయా పంచాయితీల పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుంది... ఈ రోజుల్లో కూడా ఆయా గ్రామాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.













