MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే

ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే

Pulse Polio: తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28, ఆదివారం 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో నిరోధక చుక్కలు వేయనున్నారు.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 27 2026, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లు
Image Credit : Asianet News

జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లు

ఆదివారం (రేపు) జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ల వద్ద చిన్నారులకు రెండు చుక్కల టీకా వేయనున్నారు. అదే సమయంలో పోలియో బూత్‌కు రాలేకపోయిన పిల్లలు ఒక్కరూ మిగిలిపోకుండా జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వైద్య బృందాలు టీకాలు వేయనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ జనాభా అధికంగా ఉండటంతో అక్కడ జూలై 1న అదనపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
40 లక్షలకుపైగా చిన్నారులకు టీకా.. భారీ ఏర్పాట్లు
Image Credit : our own

40 లక్షలకుపైగా చిన్నారులకు టీకా.. భారీ ఏర్పాట్లు

ఈ ఏడాది నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 40.97 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీకా కార్యక్రమానికి అవసరమైన 52.04 లక్షల bOPV డోసులను అన్ని జిల్లాలకు ఇప్పటికే పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వేలాది మంది ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి పనిచేయనున్నారు.

Related Articles

Related image1
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Related image2
Idupu Kayitham: ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డ‌బ్ చేయండి.. అస‌లు ఇదేం పంచాయితీ సామీ.!
34
ప్రత్యేకంగా ఈ ప్రాంతాల పిల్లలపై దృష్టి
Image Credit : Asianet News

ప్రత్యేకంగా ఈ ప్రాంతాల పిల్లలపై దృష్టి

పోలియో టీకా ఒక్క చిన్నారికీ మిస్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా వలస కార్మికుల కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, పట్టణ బస్తీలు, కొత్తగా ఏర్పడిన కాలనీలు, గిరిజన గ్రామాల్లో నివసించే పిల్లలను గుర్తించి వారికి తప్పనిసరిగా టీకా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, ఆర్టీసీతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా సమన్వయంతో పనిచేయనున్నాయి.

44
ఇప్పటికే టీకా వేయించినా మరోసారి ఎందుకు వేయాలి?
Image Credit : social media

ఇప్పటికే టీకా వేయించినా మరోసారి ఎందుకు వేయాలి?

చాలా మంది తల్లిదండ్రుల్లో గతంలో పోలియో చుక్కలు వేయించాం కదా.. మళ్లీ ఎందుకు వేయించాలి అనే సందేహం ఉంటుంది. అయితే ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం వల్లే పిల్లలకు పూర్తి స్థాయి రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో చివరిసారిగా 2007లో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి రాష్ట్రం పోలియో రహితంగా కొనసాగుతోంది. ఈ హోదాను భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలంటే 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి జూన్ 28న తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలని వైద్యారోగ్య శాఖ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, సమాజాన్ని పోలియో రహితంగా ఉంచడంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే
Recommended image2
LPG: ఇంకా మూడే రోజులు.. అంతలోపు ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ రద్దవడం ఖాయం
Recommended image3
Now Playing
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
Related Stories
Recommended image1
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Recommended image2
Idupu Kayitham: ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డ‌బ్ చేయండి.. అస‌లు ఇదేం పంచాయితీ సామీ.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved