MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Idupu Kayitham: ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డ‌బ్ చేయండి.. అస‌లు ఇదేం పంచాయితీ సామీ.!

Idupu Kayitham: ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డ‌బ్ చేయండి.. అస‌లు ఇదేం పంచాయితీ సామీ.!

Tollywood: యూట్యూబ్‌లో ఫోక్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా, నటుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ఇడుపు కాయితం'. ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టించ‌గానే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర తీసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 27 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇడుపు కాయితం అంటే ఏంటి..?
Image Credit : Priyadarshi Pulikonda/X

ఇడుపు కాయితం అంటే ఏంటి..?

'ఇడుపు కాయితం' అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలాకాలంగా వినిపించే సంప్రదాయ పదం. దీని అర్థం విడాకుల ఒప్పంద పత్రం. ఒకప్పుడు భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకుంటే, కోర్టుల ద్వారా కాకుండా గ్రామ పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో ఒక పత్రం రాసుకుని విడిపోయేవారు. ఆ పత్రాన్నే స్థానికంగా "ఇడుపు కాయితం" అని పిలిచేవారు. తెలంగాణ మాండలికంలో "ఇడుపు" లేదా "ఇడుసు" అంటే వదిలేయడం, విడిచిపెట్టడం అనే భావం వస్తుంది. అందుకే విడిపోతున్నామని ధృవీకరించే పత్రానికి ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం చట్టపరమైన విడాకుల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో ఈ ఆచారం దాదాపు కనుమరుగైనప్పటికీ, కొన్ని గ్రామాల్లో ఈ పదం ఇప్పటికీ వినిపిస్తుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టైటిల్‌తో మొదలైన సోషల్ మీడియా చర్చ
Image Credit : Priyadarshi Pulikonda/X

టైటిల్‌తో మొదలైన సోషల్ మీడియా చర్చ

సినిమా టైటిల్ ప్రకటించగానే చాలామంది "ఈ పదం అర్థమేంటి?" అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన కొంద‌రు నెటిజ‌న్లకు ఈ పదం కొత్తగా అనిపించింది. అయితే కొంద‌రు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో దీనిపై ఫ‌న్న కామెంట్స్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ముఖ్యంగా ఎక్స్ లో ఓ యూజ‌ర్ పోస్ట్ చేస్తూ.. "ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా?" అంటూ పోస్టులు చేయగా చ‌ర్చ‌కు తెర తీసింది. ఈ చర్చ క్రమంగా భాష, మాండలికాల వైవిధ్యంపై చర్చకు దారి తీసింది. ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన పదాలు ఉంటాయని, వాటిని ఎగతాళి చేయడం కంటే వాటి అర్థాన్ని తెలుసుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Related image1
Rain: పిడుగులు ప‌డుతుంటే ‘అర్జునా.. ఫాల్గుణా..’ అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారా.?
Related image2
Tech: ఛార్జర్‌లా కనిపించే హిడెన్ కెమెరా.. 1080P వీడియో, మోషన్ డిటెక్షన్‌తో పాటు మరెన్నో ఫీచర్లు
34
ఘంటా చక్రపాణి స్పందనతో మరింత వేడెక్కిన వివాదం
Image Credit : Asianet News

ఘంటా చక్రపాణి స్పందనతో మరింత వేడెక్కిన వివాదం

ఈ టైటిల్‌పై వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సోషల్ మీడియాలో స్పందించారు. "ఇడుపు కాయితం అంటే విడిపోయే సమయంలో రాసుకునే పత్రం. అర్థం తెలియకపోతే విమర్శించడం ఎందుకు?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ పోస్టుకు మద్ధతుగా చాలామంది తెలంగాణ నెటిజన్లు స్పందించగా, మరికొందరు భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని సూచించారు. దీంతో సినిమా టైటిల్ చుట్టూ సాగుతున్న చర్చ మరింత విస్తరించింది.

ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి “విడాకులు” లో ఏముందిరా! ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు. చూడకండి! pic.twitter.com/Qk9Dl5oaTc

— Prof. Chakrapani Ghanta (@GhantaC) June 26, 2026

44
సినిమా విడుదలకు ముందే భారీ ప్రచారం
Image Credit : Snehith Media/YT

సినిమా విడుదలకు ముందే భారీ ప్రచారం

సాధారణంగా సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన తర్వాతే చర్చ మొదలవుతుంది. కానీ 'ఇడుపు కాయితం' విషయంలో టైటిల్ ఒక్కటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా కథపై కూడా ఆసక్తి పెరిగింది. టైటిల్ చూస్తుంటే తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ప్రచారం రావడం చిత్రబృందానికి కలిసొచ్చే అంశంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే... "ఇడుపు కాయితం" అనే టైటిల్ వెనుక దర్శకుడు ఎలాంటి కథను దాచారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Rain: పిడుగులు ప‌డుతుంటే ‘అర్జునా.. ఫాల్గుణా..’ అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
Tech: ఛార్జర్‌లా కనిపించే హిడెన్ కెమెరా.. 1080P వీడియో, మోషన్ డిటెక్షన్‌తో పాటు మరెన్నో ఫీచర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved