TelanganaJobs : 7వ తరగతి చదివినా ఉద్యోగాలు ... నెలకు రూ.20,000 నుండి 1,30,000 సాలరీ
తెలంగాణలో ఈ కొత్త సంవత్సరంలో ఉద్యోగాల జాతర మొదలయ్యింది. తెలంగాణ హైకోర్టులో వేల నుండి లక్షకు పైగా సాలరీతో కూడిన ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యారు. మీకు అన్ని అర్హతలుంటే లక్షలు సంపాదన, మంచి హోదా, సమాజంలో గౌరవాన్ని అందించే ఉద్యోగాలు మీ సొంతం.
Telangana High Court Jobs
Telangana High Court Jobs : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్రంలోని అత్యున్నత న్యాయస్థానంతో పాటు న్యాయ శాఖలో పనిచేసే అద్భుత అవకాశం వచ్చింది. నూతన సంవత్సరంలో నిరుద్యోగుల సర్కార్ నౌకరీ ఆశలకు రెక్కలు తొడుగుతూ హైకోర్టు భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
తెలంగాణ హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న కోర్టులు, న్యాయ వ్యవస్థలో పనిచేసేందుకు ఏకంగా 1,673 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీల వివరాలు, విద్యార్హతలు, పోస్టింగ్... ఇలా అన్ని వివరాలను నోటిఫికేషన్ లో తెలియజేసారు. ఈ నెల(జనవరి) లోనే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది.ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుని మీరు అర్హులైతే దరఖాస్తుకు సిద్దం కండి.
తెలంగాణ హైకోర్టులో భర్తీచేసే ఉద్యోగాలివే :
పార్ట్ ఏ : తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టిరియల్ ఆండ్ సబార్డినేట్ సర్వీసెస్ పరిధిలో ఉద్యోగాల భర్తీ
నాన్ టెక్నికల్ పోస్టులు - మొత్తం 1277 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ - 340 పోస్టులు
ఫీల్డ్ అసిస్టెంట్ - 66 పోస్టులు
ఎగ్జామినర్ - 51 పోస్టులు
రికార్డ్ అసిస్టెంట్ - 52 పోస్టులు
ప్రాసెస్ సర్వర్ - 130 పోస్టులు
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ - 02-01-2025
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 08-01-2025
ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ - 3101-2025
న్యాయ శాఖలో ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పనిచేస్తున్నవారికి ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 10-02-2025
వీరికి చివరి తేదీ - 25-02-2025
పరీక్ష- ఏప్రిల్ 2025 (తేదీ తర్వాత ప్రకటిస్తారు)
టెక్నికల్ పోస్టులు - 184 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 - 45 పోస్టులు
టైపిస్ట్ -66 పోస్టులు
కాపిస్ట్ -74 పోస్టులు
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ - 02-01-2025
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 08-01-2025
ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ - 31-01-2025
న్యాయ శాఖలో ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పనిచేస్తున్నవారికి ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 10-02-2025
వీరికి చివరి తేదీ - 25-02-2025
పరీక్ష - జూన్ 2025 (తేదీ తర్వాత ప్రకటిస్తారు)
పార్ట్ బి : తెలంగాణ హైకోర్టు పరిధిలో
కోర్ట్ మాస్టర్ - 12 పోస్టులు
కంప్యూటర్ ఆపరేటర్ - 11 పోస్టులు
అసిస్టెంట్ - 42 పోస్టులు
ఎగ్జామినర్ -24 పోస్టులు
టైపిస్ట్ -12 పోస్టులు
కాపిస్ట్ - 16 పోస్టులు
సిస్టమ్ అసిస్టెంట్ -20 పోస్టులు
ఆఫీస్ సబార్డినేట్ - 75 పోస్టులు
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ - 02-01-2025
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 08-01-2025
ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ - 31-01-2025
న్యాయ శాఖలో ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పనిచేస్తున్నవారికి ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 10-02-2025
వీరికి చివరి తేదీ - 25-02-2025
పరీక్ష - ఏప్రిల్ 2025 (తేదీ తర్వాత ప్రకటిస్తారు)
పోస్టులవారిగా సాలరీ, విద్యార్హతలు :
ప్రాసెస్ సర్వర్ :
సాలరీ - రూ.22,900 నుండి 699,150 వరకు
విద్యార్హతలు - పదో తరగతి పాసయి వుంటే చాలు లేదంటే ఇందుకు సమానమైన విద్యార్హతలు వుండాలి
రికార్డ్ అసిస్టెంట్ :
సాలరీ - 22,240 నుండి 67,300 వరకు
విద్యార్హతలు : ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన విద్యార్హతల
కాపియిస్ట్ :
సాలరీ - 22,900 నుండి 69,150 వరకు
విద్యార్హతలు : ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైనది
ఇంగ్లిష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టెక్నికల్ ఎగ్జామ్ లో పాసయి వుండాలి)
ఎగ్జామినర్ :
సాలరీ - 22,900 నుండి 69,150 వరకు
విద్యార్హతలు : ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైనది
ఫీల్డ్ అసిస్టెంట్ :
సాలరీ - 24,280 నుండి 72,850 వరకు
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
టైపిస్ట్ (తెలంగాణ జుడిషియల్ మినిస్టిరియల్ సర్విస్) :
సాలరీ - 24,280 నుండి 72,850 వరకు
విద్యార్హతలు - డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
హయ్యెర్ గ్రేడ్ టైప్ రైటింగ్
జూనియర్ అసిస్టెంట్ :
సాలరీ - 24,280 నుండి 72,850 వరకు
విద్యార్హతలు - డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చివుండాలి
స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 3 :
సాలరీ - 33,810 నుండి 96,890 వరకు
విద్యార్హతలు - డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లో అయ్యర్ గ్రేడ్
ఆఫీస్ సబార్డినేట్ :
సాలరీ - 19,000 నుండి 58,850 వరకు
విద్యార్హతలు : 7 నుండి 10 వ తరగతి
సిస్టమ్ అసిస్టెంట్ (హైకోర్టు) :
సాలరీ - 24,280 నుండి 72,850 వరకు
విద్యార్హతలు : బిటెక్ (సిఎస్సి, ఈసిఈ) లేదా డిప్లమా ఎలక్ట్రానిక్స్, బిఎస్సి (ఎలక్ట్రానిక్,కంప్యూటర్,ఐటి)
కాపియిస్ట్ (హైకోర్టు) :
సాలరీ -24,280 నుండడి 72, 850
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
టెక్నికల్ ఎగ్జామ్ లో పాసయి వుండాలి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్
టైపిస్ట్ (హైకోర్ట్):
సాలరీ - 24,280 నుండి 72,850 వరకు
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
టెక్నికల్ ఎగ్జామ్ లో పాసయి వుండాలి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్
ఎగ్జామినర్ (హైకోర్టు)
సాలరీ - 24,280 నుండి 72,850
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
అసిస్టెంట్ (హైకోర్టు) కేటగిరి 4 :
సాలరీ - 24,280 నుండి 72,850
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
కంప్యూటర్ ఆపరేటర్ (హైకోర్టు) క్యాటగిరి 3
సాలరీ - 38,890 నుండి 1,12,510
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్
కోర్ట్ మాస్టర్స్ లేదా జడ్జిలు, రిజిస్ట్రార్స్ పర్సనల్ సెక్రటరీ (హైకోర్ట్)
సాలరీ - 54,220 నుండి 133630 వరకు
విద్యార్హతలు : డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి)
Telangana High court
పై అన్ని ఉద్యోగాలకు ఇవన్నీ కామన్ (కొన్నింటికి మాత్రం స్వల్ప మార్పులుంటాయి) :
వయో పరిమితి :
18 ఏళ్ల నుండి 34 ఏళ్లలోపు వారు అర్హులు (01-7-2025 నాటికి వయసును పరిగణలోకి తీసుకుంటారు)
ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు
వికలాంగులకు 10 ఏళ్ల సడలింపు
ఎక్స్ సర్వీస్ మెన్స్ కు సడలింపు
ఎంపిక ప్రక్రియ :
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
ఎగ్జామ్ పీజు :
ఓసి, బిసి అభ్యర్థులుకు రూ.600
ఎస్సి,ఎస్టి,ఈడబ్ల్యూఎస్ , ఎక్స్ సర్వీస్ మెన్స్ , వికలాంగులకు రూ.400
దరఖాస్తు :
అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
భారతదేశంలో అత్యధిక జీతాలున్న టాప్ 5 జాబ్స్
రూ.14,79,291 సాలరీతో ...హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో జాబ్ వేకెన్సీ