MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రూ.14,79,291 సాలరీతో ...హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో జాబ్ వేకెన్సీ

రూ.14,79,291 సాలరీతో ...హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో జాబ్ వేకెన్సీ

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆరంకెల జీతంతో, మంచి సౌకర్యాలతో కూడిన జాబ్ పొందాలంటే కొన్ని అర్హతలు కలిగివుండాలి. అవేంటో చూద్దాం.

3 Min read
Arun Kumar P
Published : Jan 03 2025, 03:10 PM IST| Updated : Jan 03 2025, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
US Embassy Jobs

US Embassy Jobs

US Embassy Jobs : భారతీయ యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లాలని కలలు కంటుంటారు. యూఎస్ వెళితే ఇక లైఫ్ సెట్ అయిపోయినట్లే భావిస్తారు... నిత్యం డాలర్ డ్రీమ్స్ కంటుంటారు. కానీ USA కు వెళ్లకుండానే ఆ దేశ ప్రభుత్వంలో పనిచేసే అద్భుత అవకాశం తెలుగు యువతకు వచ్చింది.  

అమెరికా విదేశాంగ విభాగం భారతదేశంలోని పలు నగరాల్లో ఎంబసీ ఆండ్ కాన్సులేట్స్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఎంబసీల్లో ఉద్యోగాల భర్తీకి యూఎస్ సిద్దమయ్యింది. హైదరాబాద్ లో పాటు చెన్నై, కోల్ కతా,ముంబై నగరాల్లోని యూఎస్ ఎంబసీల్లో పనిచేసేందుకు భారతీయ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో పబ్లిక్ ఎంగేజ్ మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూఎస్ ఎంబసీ విడుదల చేసింది. ఇప్పటికే అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.  
 

24

విద్యార్హతలు : 

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో పబ్లిక్ ఎంగేజ్ మెంట్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందాలంటే గుర్తింపుపొందిన  యూనివర్సిటీ నుండి జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకానమి లేదా మార్కెటింగ్ లో డిగ్రీ చేసివుండాలి. 

ఉద్యోగ అనుభవం : 

కనీసం నాలుగు సంవత్సరాలు మీడియా సంస్థలో లేదంటే యూనివర్సిటీ, ఎన్జివో, ఇంటర్నేషనల్ సంస్థలు, ఎంబసీ, గవర్నమెంట్ లేదా కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం చేసివుండాలి. ఇక్కడ కూడా పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజం, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ వంటి విధులు నిర్వర్తించి వుండాలి.  

భాషలు : 

ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడటమే కాదు రాయడం, చదవడం కూడా బాగా వచ్చివుండాలి. ఎంపిక సమయంలో దీన్ని పరిశీలిస్తారు. 

హైదరాబాద్ లో పనిచేయాల్సి వుంటుంది కాబట్టి తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడగలగాలి. రాయడం, చదవడం కూడా వచ్చింది. ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తారు. 
 

34

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : 

ముందుగా గూగుల్ లో U.S.Department of state Diplomacy in Action పేజీని ఓపెన్ చేయాలి. అందులో భారతదేశంలోని అన్ని నగరాల్లో యూఎస్ ఎంబసీ ఆండ్ కాన్సులేట్స్ లో చేపడుతున్న నియామకాల వివరాలు వుంటాయి. అందులో 'Public Engagement Assistant - Press and Media' పై క్లిక్ చేయండి. 

క్లిక్ చేయగానే మరో పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఈ పబ్లిక్ ఎంగేజ్ మెంట్ అసిస్టెంట్ పోస్టు గురించి పూర్తి వివరాలు వుంటాయి. వాటన్నింటిని చదివాక ఈ పోస్టుకు మీరు అర్హులు అనుకుంటే మొదట్లోనే వుండే ''Apply to this vacancy' పై క్లిక్ చేయండి. 

లాగిన్ కోసం ఈమెయిల్ ఐడి, పాస్ వర్డ్ అడుగుతుంది. వాటిని టైప్ చేసి లాగిన్ కండి. ఇవి లేకుంటే అక్కడే క్రియేట్ అకౌంట్ ఆప్షన్ కూడా వుంటుంది. మీ వివరాలను అందించి మెయిల్, పాస్ వర్డ్ క్రియెట్ చేసుకొండి. 

మీ విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, లాంగ్వేజ్ స్కిల్ , జాబ్ కు సంబంధించిన స్కిల్స్... ఇలా వివరాలన్నింటిని టైప్ చేసి సబ్మిట్ చేయాలి. 

దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీలు : 

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 31, 2024 నుండి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. 

జనవరి 16, 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు : 

నివాస దృవీకరణ పత్రం ( ప్రభుత్వం నుండి పొందినదై వుండాలి) 

విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు 

రెస్యూమ్ లేదా సివి 

44

సాలరీ :  

 హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ నియమించే ఇది పర్మనెంట్ పోస్ట్. ఫుల్ టైమ్ వర్క్ అంటే వారానికి 40 గంటలు పనిచేయాలి.  

ఏడాదికి రూ.14,79,291 సాలరీ లభిస్తుంది. అంటే నెలకు లక్ష రూపాయలపైనే జీతం వస్తుందన్నమాట. ఇక ఇతర అలవెన్సులు కూడా వుంటాయి. 

ఈ పోస్ట్ భర్తీకి సంబంధించిన మరింత సమాచారం కోసం HyderabadHRO@state.gov కి మెయిల్ చేయండి. 

ఇవి కూడా చదవండి :

Andhra Pradesh Jobs : ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ జాబ్ ... వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు పొందండిలా!

తెలుగు యువతకు బంపరాఫర్ : రూ.50,000 సాలరీతో పవన్, లోకేష్ వద్ద పనిచేసే అవకాశం

ఏపీ యువతకు అద్భుత అవకాశం ... ఆర్టిసిలో 11,500 జాబ్స్

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved