MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana: డీలిమిటేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం తీర్మానం.. తమకు అన్యాయం చేయొద్దంటూ

Telangana: డీలిమిటేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం తీర్మానం.. తమకు అన్యాయం చేయొద్దంటూ

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేపట్టే ఈ పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.   

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 27 2025, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Telangana Chief Minister Revanth Reddy (Pic/@revanth_anumula)

Telangana Chief Minister Revanth Reddy (Pic/@revanth_anumula)

తెలంగాణ అసెంబ్లీలో జనాభా ప్రాతిపదికన పునర్విభజనపై గురువారం తీర్మానం చేసింది. ఇందుకు అసెంబ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చూస్తోందని, అయితే ఇది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని సీఎం అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
CM Revanth Reddy

CM Revanth Reddy

పునర్విభజనపై తెలంగాణ అసెంబ్లీ అభ్యంతరాలు ఏంటంటే.? 

జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. 2026 జనాభా లెక్కల తర్వాతే పునర్విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గతంలో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన శాపంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

జమ్మూ కాశ్మీర్ లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90 కి పెంచారని, సిక్కింలో 2018లో కేబినెట్ లో రిసోల్యూషన్ పాస్ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 

33
Telangana Chief Minister Revanth Reddy, Prime Minister Narendra Modi (Photo/ANI)

Telangana Chief Minister Revanth Reddy, Prime Minister Narendra Modi (Photo/ANI)

తీర్మానంలో ఏ అంశాలను ప్రస్తావించారు.? 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలని తీర్మానంలోపేర్కొన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని, పార్లమెంట్‌లో స్థానాల సంఖ్యను యథాతథంగా ఉంచాలి, అవసరమైన మార్పులను రాష్ట్ర స్థాయిలో చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తాజా జనాభా లెక్కల ప్రకారం పెంచాలని, ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని కేంద్రాన్ని కోరారు.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, పార్లమెంటు సభ్యత్వ స్థాయిని యథాతథంగా ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటపై నిలబడాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానా రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
భారత దేశం
అనుముల రేవంత్ రెడ్డి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved