MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది?

హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది?

మనవడు కల్వకుంట్ల హిమాన్షు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి హుటాహుటిన బయలుదేరారు. ముద్దుల మనవడు గాయపడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన తాత వెంటనే హైదరాబాద్ కు చేరుకున్నారు. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 07 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కేసీఆర్ మనవడికి గాయాలు
Image Credit : Instagram/Kalvakuntla Himanshu Rao

కేసీఆర్ మనవడికి గాయాలు

Kalvakuntla Himanshu : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గాయపడ్డాయి. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హిమాన్షు ఇటీవలే ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందేే... కుటుంబసభ్యులు, స్నేహితులతో గడుపుతూ  కొద్దిరోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న (జూలై 6, సోమవారం) సాయంత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జిమ్ లో గాయపడ్డ హిమాన్షు
Image Credit : Instagram/Kalvakuntla Himanshu Rao

జిమ్ లో గాయపడ్డ హిమాన్షు

హిమాన్షు ముక్కుకు గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబసభ్యులు వెంటనే గచ్చిబౌలిలోకి ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే కేటీఆర్ దంపతులు హాస్పిటల్లోనే ఉన్నారు... కొడుకు పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదిస్తున్నారు. 

మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాస్పిటల్ కు చేరుకుని హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా హాస్పిటల్ కు చేరుకుని మనవడిని పరామర్శించనున్నారు… ఇందుకోసం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?
33
హిమాన్షు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
Image Credit : Instagram/Kalvakuntla Himanshu Rao

హిమాన్షు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ కీలక నాయకులంతా గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. అయితే ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని... హిమాన్షుకు గాయం చిన్నదేనని కేటీఆర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హిమాన్షుకు ట్రీట్మెంట్ జరుగుతోందని… త్వరలోనే అతడు కోలుకుంటాడని కేటీఆర్ అన్నారు. తన కొడుకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ చాలామంది ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని… వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నానని కేటీఆర్ అన్నారు.

My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment 

He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern

— KTR (@KTRBRS) July 7, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు లేదా..! సింప్లిసిటీలో గుమ్మడి నర్సయ్య నే మించిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇకలేరు
Recommended image2
IMD Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్
Recommended image3
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !
Related Stories
Recommended image1
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved