కేవలం మీరీ పంట వేస్తే చాలు... ప్రభుత్వమే ఎకరాకు రూ.50 వేలు ఇస్తుంది.. ఎలాగో తెలుసా?
మీరు వ్యవసాయ భూమి వుందా..? అయితే మీకు మంచి లాభాలు అందించే పంటలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. రూ.50 వేలకు పైగా ఆర్థిక సాయం చేసి మరి లక్షల ఆదాయాన్నిచ్చే పంటలను పరిచయం చేస్తోంది. అదెలాగో తెలుసా?
Oil Palm
OilPalm : సాంప్రదాయ పంటల సాగుచేసే రైతుల కష్టాల గురించి అందరికీ తెలుసు. వర్షాభావ పరిస్థితులు లేదంటే అధికవర్షాలు, మండే ఎండలు వంటి వాతావరణ పరిస్థితులు... వీటిని దాటుకుని మంచి దిగుబడి సాధించినా గిట్టుబాటు ధర దక్కక లేదంటే దళారుల చేతిలో చిక్కుకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్లే సాంప్రదాయ పంటల సాగునుండి రైతులను వాణిజ్య పంటల సాగు దిశగా తరలించే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.
Oil Palm
మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా రైతులు కూడా మారాలని...మార్కెట్ లో మంచి డిమాండ్ వున్న పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఫామ్ అయిల్ కు దేశంలో వున్న డిమాండ్ ను గుర్తించిన ప్రభుత్వం ఆయల్ ఫామ్ సాగుపై సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం విదేశాల నుండి భారీగా ఆయిల్ దిగుబడి చేసుకుంటోంది భారత్... అలా కాకుండా స్వదేశంలోనే పామ్ ఆయిల్ సాగును పెంచి ఇక్కడే ఆయిల్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పామ్ ఆయిల్ సాగుచేసే రైతులకు కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం భారీగా సబ్సిడీలు అందిస్తోంది.
Oil Palm
భారత దేశంలో పామ్ ఆయిల్ సాగు చాలా తక్కువగా వుంది. దీంతో విదేశాల నుండి భారీగా ఆయిల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. దేశంలో వాడుతున్న ఆయిల్ లో 70 శాతం విదేశాల నుండి వస్తున్నదే...దేశీయంగా లభిస్తున్నది కేవలం 30 శాతమే. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఈ ఆయిల్ ధరలపై పడుతోంది... దీంతో ఒక్కోసారి అమాంతం ధరలు పెరిగి ప్రజలను కంగారుపెడుతోంది.
Oil palm
దీంతో స్వదేశంలోనే పామ్ ఆయిల్ సాగును విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని రైతులను ఆ దిశగా ప్రోత్సహించేందుకు భారీగా సబ్సిడీలు అందిస్తోంది. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకే రైతులకు మొక్కలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. అలాగే బిందుసేద్యం పరికరాలను కూడా ఎస్సి, ఎస్టి రైతులకు ఉచితంగా, బిసిలకు 90శాతం సబ్సిడిపై అందజేస్తున్నారు. పంట ఎదుగుదల కాలంలో ప్రభుత్వం ఆర్థికసాయం కూడా చేస్తోంది.
Oil palm
ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగుకు 50 నుండి 57 మొక్కలు అవసరం అవుతాయి. ఇందుకోసం రూ.11,600 ఖర్చు అవుతుంది... ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇక మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్లకు దిగుబడి వస్తుంది. అప్పటివరకు రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా పంట నిర్వహణకోసం ఏడాదికి రూ.4,200 ఆర్ధికసాయం చేస్తుంది. ఇలా నాలుగేళ్లకు రూ.16,800 అందజేస్తుంది. డ్రిప్ కోసం ఎకరాకు 22,518 సబ్సిడీ అందిస్తోంది. ఇలా మొత్తంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులు రూ.50,000 పైగా సబ్సిడీ పొందవచ్చు.
ఇక దిగుబడి ప్రారంభమయ్యాక రైతులు లాభాలను పొందుతారు. ఇలా ఏకంగా 30ఏళ్ల వరకు నిరంతరం ఆదాయం అందుతూనే వుంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఆయిల్ ఫామ్ ధరలను బట్టి ఎకరాకు రెండు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ పంటకు పెద్దగా నీటి అవసరం లేదు... కాబట్టి నీటిఎద్దడి ప్రాంతాలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైనవే.
Oil palm
ఆయిల్ పామ్ సాగు,సబ్సిడి కోసం రైతులు ఇలా దరఖాస్తు చేసుకొండి :
పామ్ ఆయిల్ సాగుచేసే రైతులు ఈ సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు తెలియజేయాల్సి వుంటుంది. సబ్సిడి కోసం చాలా సులువుగా మొబైల్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. గూగుల్ లో MIP Registration అని టైప్ చేయగానే తెలంగాణ ప్రభుత్వ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆదార్, భూమి పాస్ బుక్, కుల దృవీకరణ పత్రం సమర్పించాల్సి వుంటుంది.ఈ విధంగా తెలంగాణలో పామ్ ఆయిల్ పండిస్తున్న రైతులు దరఖాస్తు చేసుకొని సబ్సిడీ పొందవచ్చు.