MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?

Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 25, శుక్రవారం) కేరళలో పర్యటించనున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డును అందుకోడానికే వెళుతున్నారు.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 25 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
రేవంత్ రెడ్డి కేరళ పర్యటన... ఎందుకో తెలుసా?
Image Credit : X/Ponnam Prabhakar

రేవంత్ రెడ్డి కేరళ పర్యటన... ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. కేరళ మాజీ మంత్రి, దివంగత నేత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్’ 2026 సంవత్సరానికి ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డుకు సీఎం రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలు, ఆయన నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 25, శుక్రవారం) కేరళకు వెళుతున్నారు... ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుండి నిలంబూరుకు బయలుదేరారు. ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతి సందర్భంగా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కూడా పాల్గొననున్నారు. ఆయన ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేయనున్నారు.

ఈ పురస్కారం కింద రూ.1 లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించనున్నారు. అవార్డు ఎంపిక కమిటీలో కేరళ ఎంపీ బెన్నీ బెహనన్, రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్, ప్రముఖ మేథావి కల్పెట్ట నారాయణన్ ఉన్నారు. వీరే తెలంగాణ సీఎంను ఈ అవార్డుకు ఎంపికచేశారు.

రేవంత్ రెడ్డినే ఎందుకు ఎంపిక చేశారు?

ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి... అందుకే సామాన్యుల సమస్యలను తెలుసుకుంటూ ప్రజాపాలన సాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నిబద్ధతను కూడా అవార్డు ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు ఎమ్మెల్యే షౌకత్ తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఇంతకీ ఆర్యదాన్ ముహమ్మద్ ఎవరు?
Image Credit : X/Rahul Gandhi

ఇంతకీ ఆర్యదాన్ ముహమ్మద్ ఎవరు?

ఆర్యదాన్ ముహమ్మద్ కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. 1935 మే 15న నిలంబూరులో జన్మించిన ఆయన ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా ప్రజా జీవితంలోకి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు కోజికోడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో కీలక పదవుల్లో పనిచేశారు. ఇలా వ్యవసాయదారుడు, రాజకీయ నాయకుడు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా ప్రజా జీవితంలో కొనసాగారు.

1977లో తొలిసారి నిలంబూర్ నియోజకవర్గం నుంచి కేరళ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980లో ఉప ఎన్నికలో విజయం సాధించడంతో పాటు 1987, 1991, 1996, 2001, 2006, 2011 ఎన్నికల్లోనూ నిలంబూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా ఆయన ఎనిమిదిసార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆర్యదాన్ ముహమ్మద్ కేరళ ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. 1980–81లో కార్మిక, అటవీ శాఖల మంత్రిగా పనిచేశారు. 1995–96లో కార్మిక, పర్యాటక శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2011లో ఏర్పడిన రెండో ఉమ్మన్ చాందీ ప్రభుత్వంలో విద్యుత్, ఆ తర్వాత రవాణా శాఖలకు మంత్రిగా పనిచేశారు.

మంత్రిగా మాత్రమే కాకుండా కేరళ శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ వంటి కీలక కమిటీలకు కూడా ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్ర మార్కెటింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, NCDC, NAFED వంటి సంస్థల్లో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

2022లో కన్నుమూసిన ఆర్యదాన్

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన ఆర్యదాన్ ముహమ్మద్ 2022 సెప్టెంబర్ 25న 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణించిన రోజునే ఇప్పుడు నిర్వహిస్తున్న స్మారక కార్యక్రమం కూడా నాలుగో వర్ధంతి సందర్భంగా జరుగుతోంది. ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవను గుర్తుచేసుకుంటూ ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది.

ఇలా కేరళలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆర్యదాన్ ముహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ పురస్కారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. నిలంబూరులో జరిగే కార్యక్రమంలో ఆయనకు రూ.1 లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించనున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balapur Ganesh Laddu: హిస్టరీ క్రియేట్ చేసిన బాలాపూర్ లడ్డూ వేలం.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?
Recommended image2
Dasara Holidays: దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా?
Recommended image3
Telangana: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీ ఊర‌ట
Related Stories
Recommended image1
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image2
Now Playing
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved