MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఏఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేసారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 23 2025, 06:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు
Image Credit : X/Cyberabad Traffic Police

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నదులు, వాగులు వంకలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ఇలాంటి సమయంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
Image Credit : ANI

ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీచేసింది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయట... ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.

36
పొంచివున్న వరదలు
Image Credit : Getty

పొంచివున్న వరదలు

అతిభారీ వర్షాలు కురిసే జిల్లాలకు వరద ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని... గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

46
హైదరాబాద్ వర్షాల సంగతేంటి...
Image Credit : Getty

హైదరాబాద్ వర్షాల సంగతేంటి...

రాజధాని నగరం హైదరాబాద్ కు కూడా రెయిన్ అలర్ట్ జారీచేశారు. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయంటూ హై అలర్ట్ జారీ చేసారు. ఈ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి... దీంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసుల సూచిస్తున్నారు.

56
ఆంధ్ర ప్రదేశ్ లోనూ కుండపోతే...
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ లోనూ కుండపోతే...

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడ్రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి... పలుచోట్ల అత్యంత భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

66
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : Getty

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

ఇవాళ (బుధవారం) అల్లురి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు
Recommended image2
Rain Alert: వాన‌లే వాన‌లు.. వ‌చ్చే 5 రోజులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved