MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక .. హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..

Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక .. హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..

Rain Alert: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం క్లౌడ్ బరస్ట్‌తో నగరం స్తంభించింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో రహదారులు మునిగిపోయి, ట్రాఫిక్ దెబ్బలు, అధికారులు అత్యవసర నంబర్లు ప్రకటించారు. 

3 Min read
Rajesh K
Published : Aug 08 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌లో క్లౌడ్ బరస్ట్.
Image Credit : Getty

హైదరాబాద్‌లో క్లౌడ్ బరస్ట్.

Weather Update: గత 24 గంటలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నా, హైదరాబాద్‌లో మాత్రం వరుడు రౌద్ర రూపం దాల్చింది. రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ గా మారి పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం. రోడ్లు నదుల్లా మారాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఎమర్జెన్సీ నెంబర్లు ప్రకటించింది.

25
తెలంగాణ వాతావరణం
Image Credit : Getty

తెలంగాణ వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో ఐదు రోజుల పాటు ఈ రెండు రాష్ట్రాలతో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఆగస్టు 8, 9 తేదీల్లో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని IMD సూచించింది. గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని అంచనా. 

ఇక తెలంగాణలో రోజంతా దట్టమైన మేఘాలు కమ్మి ఉంటాయి. ఉదయం తేలికపాటి జల్లులు కురుస్తుండగా, మధ్యాహ్నం 2 తర్వాత వర్షం తీవ్రత పెరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎక్కువ భాగంలో జోరుగా వర్షం కురుస్తుంది. దక్షిణ తెలంగాణలో అర్థరాత్రి 2 గంటల వరకు మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Telangana Weather: కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఇక వర్షాలే వర్షాలు.. ఐఎండీ ఏం చెప్పిందంటే?
Related image2
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు..
35
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి
Image Credit : Getty

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్ లో కూడా నేడు( శుక్రవారం) మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోజంతా దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉంటాయనీ, ఉదయం ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడతాయనీ అంచనా. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని IMD అంచనా వేసింది. 

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మడగాస్కర్ వైపు వెళ్లిపోగా, అండమాన్ ప్రాంతంలోని అల్పపీడనం బలహీనపడిందనీ, గాలి వేగం తక్కువగా ఉండటం వలన వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. గాలి గంటకు 10-11 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 

ప్రధానంగా రాయలసీమ, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగుపాటు ప్రమాదం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

45
తడిసిముద్దైన హైదరాబాద్
Image Credit : Getty

తడిసిముద్దైన హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నగరంలో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 

అలాగే.. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని, ఆ తర్వాత భారీ వర్షం సాయంత్రం 6 వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలి దిశ మార్పుల వల్ల వర్ష సమయాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలిపింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో, హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.

 

55
ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..
Image Credit : Getty

ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..

అధికారుల సెలవులు రద్దు

రెవెన్యూ అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో వర్ష సంబంధిత సహాయం కోసం ప్రజలు సంప్రదించాల్సిన ముఖ్యమైన ఫోన్ నెంబర్ల వివరాలను అందించారు.

  • కంట్రోల్ రూమ్ — అత్యవసర నెంబర్లు 
  • హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్: 040-2302813, 7416687878
  • NDRF సహాయం కోసం: 8333068536
  • ICCC ఫిర్యాదుల కోసం: 8712596106
  • Hyderabad Disaster Response Force: 9154170992
  • సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు: 8712660600
  • రాచకొండ ట్రాఫిక్ పోలీసులు: 8500411111, 8712662999
  • విద్యుత్ సమస్యల కోసం: 7901530966
  • RTC: 9444097000
  • GHMC: 8125971221
  • HMWSSB (నీటి సరఫరా): 9949930003

#HyderabadRains Helplines ☎️

NDRF: 83330 68536
ICCC: 87125 96106
HYDRAA: 91541 70992
HYDTP: 87126 60600
CYBTP: 85004 11111
RCKTP: 87126 62999
TGSPDCL: 79015 30966
RTC: 94440 97000
GHMC: 81259 71221
HMWSSB: 99499 30003#Hyderabad#Rains#Helpline

— Hi Hyderabad (@HiHyderabad) August 7, 2025

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved