- Home
- Telangana
- Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
తెలుగు విద్యార్థులకు వరుసగా 12, 13 రోజుల దసరా సెలవులు వస్తున్నాయి. మరి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులు వస్తున్నాయో తెలుసా?

తెలుగు ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులు?
Dasara Holidays : తెలుగు విద్యార్థులకు దసరా పండక్కి 12, 13 రోజుల సెలవులున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ అక్టోబర్ 10న మూతపడనున్నాయి... తిరిగి అక్టోబర్ 22, 23 తేదీల్లో తెరుచుకుంటాయి. ఇలా తెలంగాణ విద్యార్థులకు 13, ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్ కి 12 రోజులు దసరా సెలవులున్నాయి. మరి ఉద్యోగుల సంగతేంటి? ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు దసరా సెలవులు ఎన్నిరోజులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ ఉద్యోగులకు దసరా సెలవులు..
తెలంగాణ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కంటే ఎక్కువగా దసరా సెలవులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకుంటారు… అలాగే దసరా అనేది చాలా పెద్ద పండగ. అందుకే ఉద్యోగుకులకు కూడా వరుసగా నాలుగైదు రోజుల సెలవులు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు...
అక్టోబర్ 18 (ఆదివారం) - సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా అధికారిక సెలవు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈరోజు పండగ సెలవు లేకున్నా ఆదివారం సాధారణ సెలవు ఉండేది.
అక్టోబర్ 19 (సోమవారం) - మహర్నవమి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంది. అంటే ముందుస్తు అనుమతితో ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.
అక్టోబర్ 20 (మంగళవారం) - విజయదశమి (దసరా) పండగ సందర్భంగా ఉద్యోగులందరికి సెలవు ఉంటుంది.
అక్టోబర్ 21 (బుధవారం) - దసరా తర్వాతిరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అధికారిక సెలవు ఉంది.
తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులకు సెలవులు
అక్టోబర్ 17 (శనివారం) - కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజుల సెలవులు ఉంటాయి. వీరికి దసరా పండక్కి ముందు శనివారం హాలిడే ఉంది.
అక్టోబర్ 18 (ఆదివారం) - సద్దుల బతుకమ్మకి ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఉండదు. కానీ ఈసారి బతుకమ్మ పండగ ఆదివారం వస్తోంది... కాబట్టి వీకెండ్ సెలవు కలిసివస్తోంది.
అక్టోబర్ 20 (మంగళవారం) - దసరా పండక్కి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది.
మధ్యలో అక్టోబర్ 19 (సోమవారం) ఒక్కరోజు ఉద్యోగులకు వర్కింగ్ డే ఉంటుంది. ఈరోజు ఎలాగోలా మేనేజ్ చేసి లీవ్ తీసుకుంటే దసరా పండక్కి వరుసగా నాల్రోజుల సెలవులు కలిసివస్తాయి. ఎలాగూ పిల్లలకు సెలవులుంటాయి కాబట్టి పండగరోజుల్లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు దసరా సెలవులు..
తెలంగాణ విద్యార్థులకు అక్టోబర్ 10 నుండి 22 వరకు దసరా సెలవులుంటే ఏపీ విద్యార్థులకు మాత్రం అక్టోబర్ 21 వరకే సెలవులున్నాయి... అంటే ఒకరోజు తక్కువ అన్నమాట. సేమ్ ఇలాగే ఏపీ ఉద్యోగులకు తెలంగాణవారికంటే తక్కువగానే పండగ సెలవులు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు దసరా సెలవులు
అక్టోబర్ 18 (ఆదివారం) - దుర్గాష్టమికి అధికారిక సెలవు ఉంది. కానీ ఈరోజు పండగ సెలవు లేకున్నా వీకెండ్ సెలవు ఉండేది.
అక్టోబర్ 20 (మంగళవారం) - విజయదశమి సెలవు. పండగ ఒక్కరోజే ఉద్యోగులకు సెలవు ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రెండ్రోజుల సెలవులున్నాయి… కానీ వరుసగా కాదు. అయితే ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు దుర్గాష్టమి ముందురోజు శనివారం కూడా వీకెండ్ సెలవు ఉంటుంది... అంటే వీరికి మూడ్రోజులు సెలవులన్నమాట.
తెలుగు విద్యార్థులకు దసరా సెలవులు...
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు అక్టోబర్ 12 నుండి అక్టోబర 22 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే వీటికి రెండ్రోజుల వీకెండ్ సెలవులు కలిసివస్తున్నాయి... అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11న ఆదివారం. కాబట్టి 11 రోజులు దసరా సెలవులకు ఈ రెండ్రోజులు యాడ్ అవ్వడంతో హాలిడేస్ సంఖ్య 13 రోజులకు చేరింది.
ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణవారికంటే ఓ సెలవు తక్కువగా వస్తోంది. వీరికి కూడా అక్టోబర్ 10 నుండే సెలవులు ప్రారంభమైనా అక్టోబర్ 21 వరకే కొనసాగనున్నాయి... అక్టోబర్ 22న తిరిగి ప్రారంభం అవుతాయి. అంటే ఏపీ విద్యాసంస్థలకు 12 రోజులు దసరా సెలవులు వస్తున్నాయన్నమాట.

