హైదరబాదీలు ... మార్కెట్ ధరకంటే రూ.10-20 తక్కువకే కూరగాయలు పొందండిలా
మీరు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో నివాసం వుంటున్నారా? అయితే మీరుండే చోటు కంటే కూరగాయలను చాలా తక్కువ ధరకు పొందవచ్చు... అదెలాగో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొండి.
Vegetables Price Koyembedu
Vegetables Price in Hyderabad : మనం బ్రతకడానికి కనీస అవసరాలైన కూడు,గూడు, గుడ్డ అవసరం. వీటిలో మంచి గూడు, గుడ్డలు లేకపోయినా పర్వాలేదు... కానీ కడుపులో కూడు మాత్రం పడాలి. అందుకే కూటి కోసమే కోటివిద్యలు లాంటి సామెతలు పుట్టుకువచ్చాయి. అయితే ప్రస్తుత సామాన్యుడు కోటి విద్యలు నేర్చినా కూడు దొరకడం కష్టంగా మారుతోంది. మార్కెట్ లో ధరలు అలా వున్నాయి. నిత్యావసర సరుకులు ఏది కొనాలన్నా జేబులకు చిల్లుపడే పరిస్థితి వుంది. ఇక కూరగాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు జేబులో వంద రూపాయల నోటు పెట్టుకుని వెళితే బ్యాగ్ నిండా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడలా కాదు... ఒక్కో కూరగాయ కిలో ధరే రూ.100 పైగా పలుకుతోంది. దీన్నిబట్టే ఓ కుటుంబానికి సరిపడా కూరగాయలు కొనాలంటే ఎంత డబ్బు అవసరమో మీరే ఊహించుకొండి. ఒక్కో కూరగాయలు, ఆకుకూరల ధరలు వింటేనే సామాన్యులకు గుండె ఆగినంత పని అవుతోంది.
ఇక చేసేదేం లేక కూరగాయల విషయంలో లగ్జరీని వదిలిపెడుతున్నారు సామాన్యులు... అంటే వంటింట్లో ఉపయోగించే వాటినే కొంటున్నారు. కానీ అన్ని వంటల్లో ఉపయోగించే కూరగాయల ధరలే ఎక్కువగా వున్నాయి. అవసరం వున్నవి కొనాలన్నా వంద రూపాయల నోటు కాదు నోట్లు కావాల్సివస్తోంది. ఇలా మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి... కాబట్టి తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేయడం ఎలాగో తెలుసుకుందాం.
vegetables price in Hyderabad
తక్కువ ధరకే కూరగాయలు కొనడం ఎలా?
హైదరబాద్... వందల కోట్ల శ్రీమంతుల నుండి వందరూపాయల రోజుకూలీ వరకు జీవించే నగరం. ఇక్కడ బ్రతకాలంటే దండిగా డబ్బుండాలి... లేదంటే తెలివిగా బ్రతకాలి. బాగా డబ్బున్నోళ్లు ఎలాగూ ఎంతయినా ఖర్చుచేసి దర్జాగా బ్రతుకుతారు... కానీ సామాన్యులు మాత్రం రూపాయి రూపాయి చూసి ఖర్చుచేయాలి. కాబట్టి రోజువారి ఖర్చులు తగ్గించుకుంటేనే సగటు జీవి నెలజీతం సరిపోతుంది.
సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ఖర్చులే నిత్యావసరల సరుకులు, కూరగాయల ధరలే ఎక్కువ. సరుకుల కోసం డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్ కు వెళ్లి ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మరి కూరగాయలు ఖర్చును తగ్గించుకోవడం ఎలా? అయితే హైదరబాదీలు కొద్దిగా ప్లాన్ చేసుకుంటే కూరగాయలను కూడా తక్కువధరకు పొందవచ్చు. ఆ ట్రిక్స్ ఏమిటో చూద్దాం.
1. చుట్టుపక్కల ప్రాంతాల నుండి హైదరాబాద్ కు ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వచ్చేవారు చాలామంది వుంటారు. ఇలాంటివారు నెలలో ఒకటి రెండు సార్లు సొంతూళ్లకు వెళ్లివస్తుంటారు. అయితే హైదరాబాద్ లో కంటే పల్లెల్లో కూరగాయల ధరలు తక్కువగా వుంటాయి... ఎందుకంటే అక్కడ వాటిని రైతులే అమ్ముతారు, వ్యాపారులు కాదు. కాబట్టి ఇలా తరచూ సొంతూళ్లుకు వెళ్లేవారు అక్కడినుండే కూరగాయలు తెచ్చుకుంటే ఖర్చు తగ్గుతుంది.
2. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోడ్ల పక్కన కొందరు రైతులు కూరగాయలు అమ్ముతుంటారు. అప్పుడే పొలంలోంచి తెచ్చిన తాజా కూరగాయలను తక్కువ ధరకే అమ్ముతుంటారు... అంటే నగరంలో కంటే తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి శివారు ప్రాంతాలకు దగ్గర్లో వుండేవారు ఇలా బయటకు వెళ్లి కొంటే కాస్త ఖర్చు తగ్గుతుంది.
3. ఎక్కువరోజులు నిల్వ వుండే కూరగాయలు తక్కువ ధర వున్నప్పుడే ఎక్కువమొత్తంలో కొనుగోలు చేసుకోవాలి. ఉదాహరణకు ఉల్లిపాయలు ఒక్కోసారి కిలో కేవలం రూ.10 కే లభిస్తాయి... అప్పుడు వాటిని ఎక్కువగా కొనుగోలు చేసుకోవాలి. అప్పుడు రూ.100 కిలో వున్నపుడు కొనాల్సిన అవసరం వుండదు. ఇలాగే అల్లం, వెల్లుల్లి వంటి నిల్వ వుండేవి ఒకేసారి కొనుగోలు చేయాలి.
4. కూరగాయలు ఏరోజుకారోజు కొనడం కంటే వారంవారం మీ కాలనీలోనో, దగ్గర్లో వుండే రైతు బజార్లలోనో వారానికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేయాలి... ఇలా వారంవారం జరిగే సంతల్లో, రైతు బజార్లలో కూరగాయల ధరలు కాస్త తక్కువగా వుంటాయి.
5. కూరగాయల ధరలు సూపర్ మార్కెట్స్, షాపుల్లో లలో చాలా ఎక్కువగా వుంటాయి. అదే బయట కొంటే చాలా తక్కువకు లభిస్తాయి. కాబట్టి కూరగాయల మార్కెట్స్, రైతు బజార్లు, తోపుడు బండ్లపై కూరగాయల కొంటే కాస్త డబ్బులు ఆదా అవుతాయి.
ఇలా రైతుల వద్ద, చిరు వ్యాపారుల వద్ద కూరగాయల కొనుగోలు చేయడంద్వారా మీరు లాభపడటమే కాదు వారికి కూడా లాభం చేసినవారు అవుతారు. ఇలా ఓ ప్లానింగ్ తో కూరగాయల కొనడంద్వారా మీ నెలవారి ఖర్చులు కాస్త తగ్గించుకోవచ్చు. ఇది మీ ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది.
vegetables price in Hyderabad
హైదరాబాద్ లో నేటి కూరగాయల ధరలు :
ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా, ఉల్లిపాయల ధరలు దిగివచ్చినా మరికొన్ని కూరగాయల ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూరగాయల ధరలెలా వున్నాయో చూద్దాం.
ఉల్లిపాయలు : పెద్దసైజువి కిలో రూ.30-40, చిన్నసైజువి రూ.60-80, సూపర్ మార్కెట్స్ లో రూ.100 వరకు ధర వుంది.
టమాటా : కిలో రూ.20-25 (రైతులు మాత్రం కిలో రూ.5 కు అమ్ముకునే పరిస్థితి)
పచ్చిమిర్చి : కిలో రూ.54-60 (ప్రస్తుతం ఎక్కువ ధర వున్న కూరగాయల్లో ఇది ఒకటి)
బీట్ రూట్ : కిలో రూ.54-60
ఆలుగడ్డ : కిలో రూ.41-46
క్యాప్సికమ్ : కిలో రూ. 49-55
కాకరకాయ : కిలో రూ.39-43
బీన్స్ ; కిలో రూ.52-57
క్యాబేజి : కిలో రూ.30-33
క్యారెట్ : కిలో రూ.52-57
క్యాలిఫ్లవర్ : కిలో రూ.35-38
వంకాయలు : కిలో రూ.41-46
అల్లం : కిలో రూ.60-70
వెల్లుల్లి : కిలో రూ.361-400
బెండకాయలు : కిలో రూ.40-50
ఇవి కూడా చదవండి
టమాటా, ఉల్లి తగ్గింది.. పచ్చిమిర్చీ ఘాటెక్కింది : హైదరాబాద్ అత్యధిక ధరలున్న కూరగాయలివే