సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. దసరా సెలవులు కాకుండా అదనంగా ఇవి కూడా
Holidays: విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఆగస్టులో వర్షాలు, రాఖీ, కృష్ణాష్టమి ఇలా రకరకాల కారణాలతో భారీగా సెలవులు రాగా సెప్టెంబర్ నెలలో అంతకు మించి సెలవులు రానున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీకెండ్ సెలవులతో పాటు
సెప్టెంబర్ నెలలో పండగలతో పాటు వారాంతపు సెలవులు కూడా కలవడంతో విద్యార్థులకు లాంగ్ లీవ్‌లు లభించనున్నాయి. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈసారి దసరా సీజన్ మరింత ప్రత్యేకంగా మారబోతోంది.
నాలుగు ఆదివారాలు
సెప్టెంబర్‌లో నాలుగు ఆదివారాలు (7, 14, 21, 28) విద్యార్థులకు సాధారణ సెలవులుగా వస్తాయి. అదనంగా, సెప్టెంబర్ 13న రెండో శనివారం కారణంగా కూడా పాఠశాలలు మూసివేస్తారు. ఇలా వీకెండ్ హాలీడేస్ మొత్తం 5 రోజులు లభించనున్నాయి. కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.
వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక సెలవు
సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి సందర్భంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కాల జిల్లాలకు ఈ సెలవును కచ్చితంగా అందిస్తారు.
దసరా పండగ సెలవులు
ఈ నెలలో అధిక సెలవులు దసరాతో లభించనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా 13 రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు తక్కువగా ఉంటాయి.
గాంధీ జయంతి కూడా
అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రభుత్వ సెలవు. కానీ ఈసారి ఇది దసరా సెలవుల్లోనే కలిసిపోనుంది. అయితే ఉద్యోగులకు ఇది కలిసి రానుంది. నిజానికి ఈసారి అక్టోబర్ 2న దసరా పండగ కూడా వస్తోంది.
మొత్తం ఎన్ని రోజులు సెలవులు?
ఆదివారాలు – 4 రోజులు (7, 14, 21, 28)
రెండో శనివారం – 1 రోజు (13)
వినాయక నిమజ్జనం – 1 రోజు (6)
దసరా సెలవులు – 10 రోజులు (సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు). అక్టోబర్ నెలలో మరో మూడు రోజులు దసరా సెలవులు ఉంటాయి.