MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారో... ఈ ఆదివారం నుండి ఐదురోజులు సెలవులే సెలవులు

School Holidays : మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారో... ఈ ఆదివారం నుండి ఐదురోజులు సెలవులే సెలవులు

Holidays : తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని స్కూళ్లకు వచ్చేవారం వరుస సెలవులు వస్తున్నాయి. కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరి నెలను వరుసగా ఐదురోజుల సెలవులతో ముగించవచ్చు.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 21 2025, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
School Holidays

School Holidays

School Holidays : సెలవు... ఈ మాట వింటేచాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఉద్యోగులు సైతం ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు... ఇక వారం మధ్యలో ఏదయినా సెలవు వచ్చిందో వారి ఆనందానికి అవధులుండవు. ఇలా స్కూలుకు వెళ్లే పిల్లలకు, ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు ఒకేసారి సెలవు వస్తే... అదికూడా ఐదారురోజులు అయితే... వారి సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఏ దసరాకో లేదంటే సంక్రాంతికో ఇలా పిల్లలు,పేరెంట్స్ కు ఒకేసారి సెలవులు వస్తాయి... అప్పుడు కూడా రెండుమూడు రోజులే సెలవులు కలిసివచ్చేది. 

అయితే వచ్చేవారం అటు స్టూడెంట్స్, ఇటు ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కు సెలవులు కలిసిరానున్నాయి. మధ్యలో ఓ రెండ్రోజులు లీవ్ తీసుకుంటే చాలు ఐదు రోజులు సెలవులు వస్తాయి. ఈ సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా హాలిడే ప్లాన్ చేసుకోవచ్చు... లేదంటే శివరాత్రి కలిసివస్తుంది కాబట్టి ఆద్యాత్మిక యాత్ర కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
school holidays

school holidays

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండ్రోజులు సెలవు :  

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వచ్చేవారం రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న శివరాత్రి ... ఈ రోజును హిందువులు ఎంతో పవిత్రంగా విశ్వసిస్తారు. పరమశివుడికి ఇష్టమైన ఈరోజు ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తుంటారు. ఈరోజు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు...భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. ఇలా హిందువుల పవిత్ర పండగ నేపథ్యంలో వచ్చే బుధవారం సెలవు ప్రకటించారు. 

ఇక ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 27న తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ తో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఫిబ్రవరి 27 అంటే శివరాత్రి తర్వాతిరోజు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. 

ఇలా ఇరురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో టీచర్లకు సాధారణ సెలవు ఇవ్వనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసి గ్రాడ్యుయేట్స్ కు కూడా ఇలాగే సెలవు ఇచ్చే అవకాశం ఉంది... లేదంటే ప్రత్యేక అనుమతి ఇవ్వవచ్చు. ఇలా వరుసగా ఫిబ్రవరి 26,27 స్కూళ్లు, కాలేజీలతో పాటు కొందరు ఉద్యోగులకు సెలవు వచ్చే అవకాశాలున్నాయి. 

33
school holidays

school holidays

రెండ్రోజుల సెలవును ఐదు రోజుల హాలిడేగా ఎలా మార్చుకోవడం : 

ఫిబ్రవరి 26, 27 వరుసగా సెలవులు వస్తున్నాయి. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఆదివారం నుండే మీ సెలవులు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 22 అంటే రేపు శనివారం ఒక్కరోజు స్కూళ్లు, కాలేజీలు నడిచేది. ఆ తర్వాతి రోజు పిబ్రవరి 23 ఏలాగూ ఆదివారం. అందరికీ సెలవు రోజే. ఇలా ఆదివారం మొదలుపెడితే వచ్చే గురువారం వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంది. 

ఫిబ్రవరి 24, ఫిబ్రవరి 25 (సోమ, మంగళవారం) లీవ్ తీసుకుంటే ఫిబ్రవరి 26 బుధవారం శివరాత్రికి అధికారిక సెలవు ఉంది. ఆ తర్వాత రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో సెలవు ఉంటుంది.  ఇలా మధ్యలో రెండు రోజులు సెలవు తీసుకుంటే వరుసగా ఐదురోజులు సెలవులు వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేవారు నాలుగురోజులు సరదాగా ఎంజాయ్ చేసి ఫిబ్రవరి 27న స్వస్థలానికి చేరుకోవచ్చు. ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు. 

ఇది కుదరకుంటే మరో ఆప్షన్ కూడా ఉంది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సెలవు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు లేనివారు శివరాత్రి రోజునుండి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 శుక్రవారం, మార్చి 1 లీవ్ తీసుకుంటే మార్చి 2 న మళ్ళీ ఆదివారం. ఇలా కూడా వరుసగా ఐదురోజుల సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కలిగినవారు మాత్రం ఓటేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకొండి. హాలిడే కంటే ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇవ్వండి. 

టీచర్లు, ఉద్యోగుల విషయం ఎలా ఉన్నా విద్యార్థులు మాత్రం ఇలా వరుస సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. ఈ సెలవుల్లో కుటుంబంతో కలిసి హాయిగా ఇంటివద్దే గడపవచ్చు... లేదంటే పేరెంట్స్ కూడా ఖాళీగా ఉంటే మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. పరీక్షలకు ముందు ఇలా హాలిడే తీసుకోవడం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది... పరీక్షల ఒత్తిడిని తగ్గించి మరింత బాగా చదివేలా తోడ్పడుతాయి. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue
Recommended image2
Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
Recommended image3
Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved