తెలుగు స్టూడెంట్స్ కు పండగే పండగ ... ఇలా చేస్తే వరుసగా 9 రోజుల క్రిస్మస్ సెలవులు!
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో క్రిస్మస్ పండక్కి మూడురోజుల సెలువులు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఏదయినా టూర్ కి ప్లాన్ చేసేవారు లేదంటే ఎక్కువరోజులు సెలవు కోరుకునేవారు ఏకంగా 9 రోజుల హాలిడేస్ పొందే అవకాశం వుంది. అదెెలాగో చూద్దాం.
School Holidays
School Holidays : సెలవులంటే ఎవరు ఇష్టపడరు చెప్పంటి... స్కూల్ కు వెళ్లే పిల్లలయితే ఎప్పుడు ఏ సెలవు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏదయినా పండగ వచ్చిందంటే చాలు సెలవులు ప్రకటించగానే ఎగిరి గంతేస్తారు. అయితే ఈ ఏడాదంతా (2014) పండగలు, భారీ వర్షాల కారణంగా చాలా సెలవులు వచ్చాయి... ఇప్పుడు ఈ సంవత్సరం మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ సమయంలో కూడా (డిసెంబర్ లో) వరుసగా సెలవులు వస్తున్నాయి.
క్రిస్టియన్స్ కు క్రిస్మస్ అనేది చాలా పవిత్రమైన పండగ. చాలారోజుల ముందుగానే కేక్ మిక్సింగ్ వంటి కార్యక్రమాలు జరుపుకోవడం, క్రిస్మస్ ట్రీస్,స్టార్స్ ఏర్పాటు చేయడం చేస్తుంటారు. ఇలా ఇప్పటికే క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ పండగ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ మూడు రోజులు అంటే డిసెంబర్ 24,25, 26 తేదీల్లో సెలవులు వస్తున్నాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఏకంగా ఐదు నుండి తొమ్మిదిరోజులు సెలవులు ప్రకటించారు.
School Holidays
స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు :
డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ. ఆ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూళ్లకు సెలవు. అయితే క్రిస్మస్ కు ముందురోజు అంటే డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ జరుపుకుంటారు. యేసు క్రీస్తు జననానికి ముందురోజు కూడా చాలా దేశాల్లో సంబరాలు జరుపుకుంటారు. ఆ కల్చర్ మన దగ్గర కూడా వుంది. కాబట్టి ఈరోజును తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే గా ప్రకటించాయి.
ఇక డిసెంబర్ 26 అంటే క్రిస్మస్ తర్వాతిరోజు మరో హాలిడే వుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 26న బాక్సింగ్ డే జరుపుకునే విషయం తెలిసిందే. క్రిస్మస్ పండగ తర్వాతిరోజు పేదలకు ధనవంతులు బహుమతులు, డబ్బులు అందిస్తుంటారు. పూర్వం తమకు అవసరంలేని వస్తువులను పెట్టెలో పెట్టి పేదవారికి అందించేవారు...అందువల్లే ఈ రోజుకు బాక్సింగ్ డే గా పేరొచ్చింది.
ఇలా తెలుగు రాష్ట్రాల్లోని సాధారణ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వరుసగా మూడురోజుల సెలవులు వస్తున్నాయి. అయితే క్రిస్టియన్ విద్యాసంస్థలకు మాత్రం ఇరు రాష్ట్రాల్లోనూ భారీగా సెలవులు వస్తున్నాయి. తెలంగాణలో ఐదురోజులు (డిసెంబర్ 23 నుండి 27వరకు), ఏపీలో 9 రోజులు(డిసెంబర్ 20 నుండి 29) సెలవులు క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
School Holidays
డిసెంబర్ లో మరోవారం సెలవు తీసుకునే ఛాన్స్ :
2024 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదిలో పండగలు, ప్రత్యేక రోజుల్లో ఇచ్చే సెలవులే కాకుండా భారీ వర్షాలు, వరదల కారణంగా మరిన్ని హాలిడేస్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. ఏడాది చివర్లో మరో మూడ్రోజుల క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి. అయితే ఓ రెండ్రోజులు సెలవు పెడితే ఏకంగా 9 రోజుల క్రిస్మస్ హాలిడేస్ పొందవచ్చు.
హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్కూళ్లకు శని, ఆదివారాలు సాధారణ సెలవు వుంటుంది. అంటే డిసెంబర్ 21,22 సెలవు వుంటుందన్నమాట. డిసెంబర్ 23 సోమవారం లీవ్ తీసుకుంటే మళ్లీ డిసెంబర్ 24,25,26 క్రిస్మస్ సెలవులు. మళ్లీ డిసెంబర్ 27 శుక్రవారం లీవ్ తీసుకుంటే డిసెంబర్ 28,29 (శని,ఆదివారం) మళ్లీ సెలవు. అంటే రెండు లీవ్స్ తీసుకుంటే వరుసగా 9 రోజులు సెలవులు వస్తాయి. కేవలం ఆదివారం మాత్రమే సెలవు వుండే స్కూల్ విద్యార్థులు డిసెంబర్ 23,27,28 లీవ్ పెడితే వరుసగా ఎనిమిది రోజుల సెలవులు వస్తాయి.
అయితే విద్యార్థులు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లి శ్రద్దగా చదువుకోడం చాలా ముఖ్యం. కాబట్టి అందరూ ఇలా లీవ్స్ పెట్టి ఎక్కువరోజుల సెలవులు తీసుకోవాలని చెప్పడం మా ఉద్దేశం కాదు. కేవలం క్రిస్మస్ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి హాలిడే ట్రిప్స్ కు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువరోజుల సెలవులు పొందవచ్చని చెప్పడమే మా ఉద్దేశం.