MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • గాంధీభవన్ లో కాంగ్రెస్ మీద విమర్శలు : మందక్రిష్ణ మాదిగకు రేవంత్ ఘాటు కౌంటర్

గాంధీభవన్ లో కాంగ్రెస్ మీద విమర్శలు : మందక్రిష్ణ మాదిగకు రేవంత్ ఘాటు కౌంటర్

మద్దతు ఇచ్చిన వారిని ప్రశ్నించి.. మీ చిత్తశుద్దిని నిరూపించుకోండి అంటూ... మందక్రిష్ణ మాదిగకు టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చురకలంటించారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Aug 15 2023, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పరోక్షంగా చురకలేశారు. ఎవరూ కూడా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ కమిట్మెంట్ ను అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే.. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి నిరూపించుకోవాలని అన్నారు. ఈ మేరకు మందకృష్ణకి పరోక్షంగా రేవంత్ రెడ్డి చురకలాంటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మందకృష్ణ మాదిగను ఉద్దేశిస్తూ  రేవంత్ రెడ్డి.. ‘బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి మీకు దేవుడు ఇచ్చిన అన్న కదా.. అతడిని ఎందుకు అడగడం లేదు’ అంటూ ప్రశ్నించారు. 

37

అదే సమయంలో వర్గీకరణ విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వర్గీకరణపై స్పష్టంగా మా పార్టీ విధానాన్ని చెప్పారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.  

47

మీరు మద్దతు ఒకరికి ఇచ్చి…ప్రశ్నలు మరొకరికి సంధిస్తే ఎలా?  అంటూ  మండిపడ్డారు. కాంగ్రెస్కు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై స్పష్టమైన విధానం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వర్గీకరణకే కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. 

57

అయితే.. ఎస్సీ వర్గీకరణ అనేది వ్యక్తుల కోసం చేయబోమన్నారు. దామాషా ప్రకారం  వర్గీకరణ ఎలా చేయాలో కాంగ్రెస్కు తెలుసు అన్నారు. ఎవరికి కూడా చిత్తశుద్ధిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు.

67

దీనిమీద పార్లమెంటులో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో ఉంది బిజెపి ప్రభుత్వమే కదా.. వారి ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. మీకు మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి మీ చిత్తశుద్ధి  నిరూపించుకుంటే…  మీకు కొంతైనా గౌరవం ఉంటుంది… అంటూ మందకృష్ణ మాదిగకు  రేవంత్ రెడ్డి హితవు పలికారు.

77

తాము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, తమకు ఎవరి వకాల్తాలు అవసరం లేదన్నారు. తమను బెదిరించాలని చూసేవారు తాము ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే చాలా మంచిదంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఏంటో ఎస్టీ సామాజిక వర్గానికి తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
భారతీయ జనతా పార్టీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu
Recommended image3
Rain Alert: వేగంగా విస్త‌రిస్తున్న రుతుప‌వ‌నాలు..ఈ ప్రాంతాల్లో వ‌చ్చే 2 రోజులు వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved