Rain Alert: ఆగస్టు నెలలో ఆగమాగం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షాలు.
Telangana Weather Update: తెలంగాణలో గత వారం రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆగస్టులో భారీ వర్షాలు
హైదరాబాద్‌లో ఆగస్టుల నెలలో సగటు వర్షపాతం 190 మిల్లీమీటర్లు ఉంటుందని వాతావరణ వాఖ తెలిపింది. ఈనెలలో సగం రోజులకుపైగా వర్షం కురుస్తుందనీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
KNOW
బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగింపు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
అరేబియా సముద్రంలో అల్పపీడనం
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవుల పశ్చిమంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ రెండు వ్యవస్థలు బలపడితే ఆగస్టు 5 తరువాత తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Today's FORECAST ⚠️🌧️
Except isolated rain in very few places, mainly dry weather expected in many parts of Telangana. Same forecast for Hyderabad too
Thunderstorms will start increasing in South TG (Erstwhile Nalgonda, Mahabubnagar districts) from August 5
For HYD, gradual…— Telangana Weatherman (@balaji25_t) August 2, 2025
ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులు
వచ్చే నాలుగైదు రోజులు మేఘావృత వాతావరణం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలవారీగా వర్షాల అంచనా
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అంచనా వేసింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఆగస్టుల నెలలో సగటు వర్షపాతం 190 మిల్లీమీటర్లు ఉంటుందని వాతావరణ వాఖ తెలిపింది. ఈనెలలో సగం రోజులకుపైగా వర్షం కురుస్తుందనీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.