MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Naa anveshana: మొద‌లైన ఆపరేషన్ అన్వేష్‌.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు

Naa anveshana: మొద‌లైన ఆపరేషన్ అన్వేష్‌.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు

Naa anveshana: ప్ర‌పంచ యాత్రికుడిగా చెప్పుకునే యూట్యూబ‌ర్ అన్వేష్ చిక్కుల్లో ఇరుకున్నాడు. బెట్టింగ్ యాప్స్‌కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసిన అన్వేష్ హిందూ దేవ‌త‌ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నాడు. అత‌నిపై కేసులు కూడా నమోద‌య్యాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 02 2026, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో యూట్యూబర్ అన్వేష్
Image Credit : Naa Anveshana/YT

వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో యూట్యూబర్ అన్వేష్

ట్రావెల్ వ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ తాజాగా తీవ్ర వివాదాల కేంద్రంగా మారాడు. సోషల్ మీడియాలో హిందూ దేవతలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. , అశ్లీల సంకేతాలతో కూడిన వీడియోలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ యాత్రల పేరుతో వీడియోలు చేసిన అన్వేష్, ఇప్పుడు వివాదాస్పద కంటెంట్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దర్యాప్తు వేగం పెంచిన పంజాగుట్ట పోలీసులు
Image Credit : Youtube/Naa anveshana

దర్యాప్తు వేగం పెంచిన పంజాగుట్ట పోలీసులు

అన్వేష్ వ్యాఖ్యలపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఇన్‌స్టా నిర్వాహకులకు అధికారిక లేఖ పంపారు. అక్కడి నుంచి స్పందన వచ్చిన వెంటనే నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. సహకరించకపోతే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశముందని సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు.

35
కరాటే కళ్యాణి ఫిర్యాదుతో
Image Credit : facebook.com/karatekalyani123

కరాటే కళ్యాణి ఫిర్యాదుతో

హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడాడంటూ సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా BNS సెక్షన్ 352, 79, 299తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఇదే తరహా ఫిర్యాదులు ఖమ్మం, విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. పలువురు బీజేపీ నేతలు అన్వేష్ అరెస్ట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

45
సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేకత
Image Credit : Youtube/Naa Anveshana

సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేకత

అన్వేష్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. “బాయ్‌కాట్ అన్వేష్” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్న అతడిని ఇప్పుడు పెద్ద సంఖ్యలో అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. ప్రేక్షకులే కంటెంట్ క్రియేటర్‌ను పైకి తీసుకెళ్తారని, అదే ప్రేక్షకులే పతనానికి కారణమవుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.

55
అన్వేష్ వీడియోలపై తీవ్రమైన ఆరోపణలు
Image Credit : Youtube/Naa anveshana

అన్వేష్ వీడియోలపై తీవ్రమైన ఆరోపణలు

విదేశీ ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనను ప్రోత్సహించేలా వీడియోలు చేయడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అన్వేష్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు. కొన్ని ఆడియో క్లిప్స్‌లో చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. సమాజానికి హానికరమైన కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Shani Dev: ఈ 3 రాశుల‌పై 2026లో ఏలిన నాటి శ‌ని ప్ర‌భావం.. అల‌ర్ట్‌గా ఉండాల్సిన స‌మ‌యం
Recommended image2
Business Idea: స‌రిగ్గా 3 నెల‌లు క‌ష్ట‌ప‌డితే చాలు.. ల‌క్షాధికారి కావ‌డం ఖాయం. లైఫ్ చేంజింగ్ బిజినెస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved