- Home
- Telangana
- హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను ప్రారంభించిన మంత్రులు.. ఇది వేదామృతమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్..
హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను ప్రారంభించిన మంత్రులు.. ఇది వేదామృతమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్..
హైదరాబాద్ నెక్లస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు.

హైదరాబాద్ నెక్లస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్‌లో 12.20 కోట్ల రూపాయలతో నీరా కేఫ్‌ను నిర్మించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందించనున్నారు.
అనంతరం నీరా కేఫ్ ప్రాంగణాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం ఉందని.. కాని ఇది వేదామృతం అని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేఫ్ లేదని తెలిపారు.
గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నీరా కేఫ్ నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, అక్కడకు వచ్చిన కర్ణాటకు చెందిన పలువురు స్వామీజీలతో సహా నీరాను సేవించారు.
గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ. 5 లక్షల బీమాను కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, నీరా కేఫ్‌ను రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. నీరా కేఫ్ లో 300 నుంచి 500 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ నీరా కేఫ్ నుండి టేక్ అవే సౌకర్యాన్ని కూడా కల్పించారు. కేఫ్‌లో ఏడు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.