మూసీ పరిసరాల పేదలకు కేటీఆర్ గుడ్ న్యూస్... పదివేల డబుల్ బెడ్రూం ఇళ్లు వారికే..
హైదరాబాద్ నగర నడిబొడ్డున గల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న నిరుపేదలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు.
KTR
హైదరాబాద్ : మూసీ పరివాహక ప్రాంతంలో దుర్భర పరిస్థితుల్లో నివాసముంటున్న నిరుపేదలకు బిఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళలో పదివేల ఇళ్లను మూసీ నది ప్రాంతంలో నివాసముంటున్న పేదలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ తో పాటు చుట్టపక్కల పక్కల జిల్లాల ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.
KTR
హైదరాబాద్ నడిబొడ్డున గల మూసీ నది పరివాహక ప్రాంతంతో పేదలు నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. ఇలా కబ్జాలు పెరగడంతో నది కుచించుకుపోయి వర్షాకాలం వరద నీరు జనావాసాల్లోకి చేరుతోంది. దీంతో మూసీపైన కబ్జాలను తొలగించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మానవతా దృక్ఫథంతో మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది.
KTR
ఇప్పటికే మూసీనది పరిసరాల్లో నివాసముంటున్న పేదలను ప్రమాదకర పరిస్థితుల నుండి తప్పించి సురక్షిత ప్రాంతాలను తరలించాలని నిర్ణయించారు. పేదరికంతో దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్ల ద్వారా ఉపశమనం దక్కనుందని కేటీఆర్ నేతృత్వంలో సమావేశమైన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇలా కబ్జాకు గురయిన మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా వరదల సమయంలో ప్రమాదాలు జరక్కుండా వుంటుందని తెలిపారు.
KTR
మూసీ వరదల నుండి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలే మూసీ పరివాహక ప్రాంత ప్రజల కోసం, హైదరాబాద్ నగరం కోసం ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. కబ్జాలను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR
అడ్డంకులన్నీ తొలగిన తర్వత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుడతామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఎస్ఎన్ డిపి రెండవ దశ కార్యక్రమానికి సంబందించిన పనులను త్వరలోనే మంజూరీ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.
KTR
హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై నగర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇలా తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని..తద్వారా రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరాలని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు.