- Home
- Telangana
- కాంగ్రెస్ డిక్లరేషన్లు పనిచేయవు... కేసీఆర్ కు అండగా ప్రజలే సెల్ప్ డిక్లరేషన్ : హరీష్ రావు
కాంగ్రెస్ డిక్లరేషన్లు పనిచేయవు... కేసీఆర్ కు అండగా ప్రజలే సెల్ప్ డిక్లరేషన్ : హరీష్ రావు
ఎమ్మార్ఫిఎఫ్ నాయకుడు యాతాకుల భాస్కర్ మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరాడు.

BRS
హైదరాబాద్ : తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కోసం బిఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకుపోతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్దమైన బిఆర్ఎస్ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని అసంతృప్తులు, ప్రజాసంఘాల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ మరింత బలోపేతానికి కృషిచేస్తున్నారు. ఇలా తాజాగా ఎమ్మార్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. RS
BRS
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన భాస్కర్ చేరిక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గులాబీ కండువా కప్పి భాస్కర్ ను బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BRS
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... దళిత జాతి మేలు కోసం భాస్కర్ ఎంతో కృషిచేసారని అన్నారు. తన జీవితాన్ని దళితజాతి కోసం అంకితం చేసిన నాయకుడు భాస్కర్ కు సీఎం కేసీఆర్ విధానాలు ఆకట్టుకున్నాయని... అందువల్లే ఆయన బిఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. దళితుల అభివృద్దికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని హరీష్ అన్నారు.
BRS
ఏనాడూ ప్రజలను పట్టించుకోని పార్టీలన్నీ ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు ఇస్తున్నాయని హరీష్ అన్నారు. పార్టీలన్నీ నినాదాలు మాత్రమే చేస్తే ఆ నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు...సొల్యూషన్ సర్కార్ అని హరీష్ అన్నారు.
BRS
అబద్దపు మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువయ్యాయని మంత్రి అన్నారు. ఇలా ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా అవగాహన లేకుండా మాట్లాడరని అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోయారన్నారు. ముందు గుజరాత్ గుడ్డి పాలనను సరిచేసుకోవాలని అమిత్ షాకు సూచించారు హరీష్.
BRS
ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలకు కూడా హరీష్ కౌంటర్ ఇచ్చారు. ముందు సొంత రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. బీజేపీపై కర్ణాటక ప్రజలకు కక్కోస్తే కాంగ్రెస్ గెలిచింది... ఇందులో ఆ పార్టీ గొప్పతనం ఏమీ లేదన్నారు హరీష్.
BRS
కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి నమ్మదని హరీష్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ఇలాంటి పార్టీల డిక్లరేషన్లు ప్రజలను ప్రభావితం చేయలేవని... మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని, బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని హరీష్ అన్నారు.