- Home
- Telangana
- నెరవేరిన దశాబ్ధాల కల .. సిద్ధిపేట - సికింద్రాబాద్ ప్యాసింజర్‌ను ప్రారంభించిన హరీశ్‌రావు (ఫోటోలు)
నెరవేరిన దశాబ్ధాల కల .. సిద్ధిపేట - సికింద్రాబాద్ ప్యాసింజర్‌ను ప్రారంభించిన హరీశ్‌రావు (ఫోటోలు)
సిద్ధిపేట ప్రాంత ప్రజల దశాబ్ధాల కల నెరవేరింది. సొంతూరికి రైలులో వెళ్లాలన్న ఆశ తీరింది. సిద్ధిపేట - సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. అటు మంత్రి కేసీఆర్ సైతం సిద్ధిపేటలో స్వయంగా జెండా ఊపి రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

harish rao
సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరమని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, ఈ జిల్లా కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదన్నారు.
harish rao
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటకి రైలు తెస్తాం అని అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 2006లో రైల్వే లైన్ మంజూరు అయ్యిందని.. 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని చెప్పిందని మంత్రి గుర్తుచేశారు.
harish rao
సీఎం కేసీఆర్ రైల్వే లైన్‌ని స్వయంగా రూపకల్పన చేశారని.. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు కానీ రైల్వే లైన్ రాలేదని హరీశ్ రావు చురకలంటించారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు.
harish rao
ఆనాడు కేంద్రమంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించింది కేసీఆర్ అని హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు రైలు మా వల్లే వచ్చిందని చెబుతున్నారు ఇది సిగ్గుచేటన్నారు.
harish rao
33 శాతం వాటా కడితే కనీసం సీఎం ఫోటో కూడా పెట్టలేదని.. 2,508 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 310 కోట్లు చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 330 కోట్లు ఇచ్చామన్నారు.
harish rao
ఇదంతా చూస్తుంటే సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు ఉందని హరీశ్ రావు అభివర్ణించారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందిని మంత్రి ప్రశ్నించారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది తాము...డబ్బులు ఇచ్చింది తామని హరీశ్ స్పష్టం చేశారు.