టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత: సోనియాకు ఐదు పేర్లిచ్చిన ఠాగూర్
First Published Dec 24, 2020, 4:05 PM IST
టీపీసీసీ చీఫ్ పోస్టుకు కొత్త నేత ఎంపిక ప్రక్రియ మరో ఐదు రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఐదుగురి పేర్లతో షార్ట్ లిస్ట్ ను మాణికం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి సమర్పించారు.

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకొంది. తుది దశలో టీపీసీసీ చీఫ్ పదవికి ఐదుగురు పేర్లను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో వరుస ఓటములతో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలనే హైద్రాబాద్ కు వచ్చిన మాణికం ఠాగూర్ పార్టీకి చెందిన సీనియర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల నుండి అభిప్రాయాలను సేకరించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?