ఓడిపోతే మంత్రి పదవులు కోల్పోతారు కేసీఆర్ వార్నింగ్: గతంలో వీరూ కూడ...

First Published 5, Jan 2020, 2:13 PM

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రి పదవులను కోల్పోతారని  సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైతే మంత్రి పదవులు కోల్పోతారని తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు. టీఆర్ఎస్‌లో ఇదే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే కొందరు నేతలుమంత్రి పదవులను కోల్పోయిన సందర్భాలు కూడ ఉన్నాయి. తాజాగా కేసీఆర్ చేసిన హెచ్చరిక తెలంగాణకు చెందిన మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ ఇదే తరహాలో కొన్ని ఘటనలు చోటు చేసుకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత  మంత్రి పదవులు కోల్పోయినవారు కూడ ఉన్నారు. కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రులు కూడ మారిన సందర్భాలు కూడ చోటు చేసుకొన్నాయి.

ఈ నెల 6వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానుంది.ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోనేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ సత్తాను చూపాలని భావిస్తున్నాయి.

ఈ తరుణంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రి పదవులు పోతాయని సీఎం కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రి పదవులు ఎవరికి ఉంటాయి, ఎవరి మంత్రి పదవులు పోతాయనే విషయమై త్వరలోనే తేలనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి పదవులు కోల్పోయిన వారు కూడ లేకపోలేదు.

2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లో ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్‌పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఓటమి పాలై టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. ఈ ఓటమితో ఆనాడు మంత్రిగా ఉన్న మాగంటి బాబును సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గం నుండి తొలగించారు. మాగంటి బాబును మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత బాబు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. మాగంటి బాబు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు.

2014లో ఏలూరు నుండి ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాగంటి బాబు విజయం సాధించారు. 2019 ఏప్రిల్ లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం టీడీపీ ఏలూరు ఇంచార్జీగా బాబు ఉన్నాడు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ ఘన విజయం సాధించింది. 1995 ఆగష్టు మాసంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నాలుగు జిల్లాల్లో టీడీపీ అధికారిక అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.అధికారిక అభ్యర్థులు కాకుండా రెబెల్ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆ సమయంలో చంద్రబాబునాయుడు వర్గం కీలకంగా వ్యవహరించిందనే విమర్శలు లక్ష్మీపార్వతి వర్గం అప్పట్లో చేసింది.

నల్గొండ డీసీసీబీ ఛైర్మెన్ పదవికి సీల్డ్ కవర్లో పంపిన అభ్యర్థిని కాకుండా మోతే సోమిరెడ్డిని గెలిపించారు. ఈ వ్యవహరంలో మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించారని ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి,వరంగల్‌తో పాటు మరో జిల్లాలో కూడ ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి.

ఈ నలుగురు మంత్రులకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు పంపింది. ఈ పరిణామాలు ఆనాడు టీడీపీలో సంక్షోభానికి దారి తీసింది. 1995 ఆగష్టులో ఎన్టీఆర్ ‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

అయితే టీడీపీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలపై పలు రకాల ప్రచారాలు ఉన్నాయి. కానీ, ఈ సంక్షోభంపై ఎవరి వాదనలున్నాయి. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ నెలలోతెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి మంత్రి పదవి పోతోందో అనే సర్వత్రా సాగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం మంత్రులు విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.