MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • కవితతో కొత్తపార్టీ పెట్టిస్తున్నదే కేసీఆరా..? ఇంతకూ ఆయన కొడుకుసైడా, కూతురుసైడా?

కవితతో కొత్తపార్టీ పెట్టిస్తున్నదే కేసీఆరా..? ఇంతకూ ఆయన కొడుకుసైడా, కూతురుసైడా?

కల్వకుంట్ల కవిత వ్యవహరతీరును చూస్తుంటే బిఆర్ఎస్ కు దూరమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో ఆమె కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కేసీఆర్ ఎవరివైపుంటారు… కూతురు వైపాా, కొడుకా వైపా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 28 2025, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేసీఆర్ ప్రేమే బిడ్డలను దూరం చేసిందా?
Image Credit : twitter

కేసీఆర్ ప్రేమే బిడ్డలను దూరం చేసిందా?

Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ చివరకు స్వరాష్ట్రాన్ని సాధించి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారు. ఈ సమయంలోనే తన ఇద్దరు బిడ్డలకు కీలక పదవులు ఇచ్చుకున్నారు. కొడుకు కేటీఆర్ ను మంత్రిని చేయగా, కూతురు కవితను ఓసారి ఎంపీ, మరోసారి ఎమ్మెల్సీని చేసారు. ఇలా బిడ్డల రాజకీయ భవిష్యత్ కోసం ఓ తండ్రిగా కేసీఆర్ తాపత్రయపడ్డారు. కానీ అప్పుడు ఆ తండ్రి ప్రేమతో చేసిన పనే ఇప్పుడు అన్నాచెల్లి మధ్య విబేధాలను సృష్టిస్తోందా? అంటే రాజకీయవర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కవిత కొత్తపార్టీ పెడతారా?
Image Credit : X/RaoKavitha

కవిత కొత్తపార్టీ పెడతారా?

ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన ఓ లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖలో ఆమె బిఆర్ఎస్ పార్టీ వ్యవహారతీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ లేఖతోనే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.. ఇక తాను రాసిన లేఖ బయటకురావడంపై కవిత చేసిన కామెంట్స్ మరింత హీటెక్కించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత బిఆర్ఎస్ ను వీడతారని... సొంతంగా కొత్తపార్టీ పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

35
కవిత లెటర్ పై బిజెపి ఎంపీ ఆసక్తికర కామెంట్స్
Image Credit : our own

కవిత లెటర్ పై బిజెపి ఎంపీ ఆసక్తికర కామెంట్స్

తాజాగా బిజెపి ఎంపీ రఘునందర్ రావు ఈ కవిత లెటర్ వ్యవహారంపై స్పందించారు. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమేనని.. ఆయనే కూతురితో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. జూన్ 2న అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే కవిత కొత్తపార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు. తర్వాత వైఎస్ షర్మిల లాగే కవిత కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని రఘునందన్ రావు అన్నారు.

ఇలా ఓవైపు కేటీఆర్ కు పూర్తిగా బిఆర్ఎస్ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు కూతురి రాజకీయ భవిష్యత్ ను సెట్ చేసే ప్లాన్ లో ఉన్నారని రఘునందర్ రావు మాటలను బట్టి అర్థమవుతోంది. దీనివల్ల అటు కేటీఆర్, ఇటు కవిత ఇద్దరికీ లాభమే. ఎలాగంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొందరు బిఆర్ఎస్ నాయకులు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారట... ఇలాంటివారు కాంగ్రెస్, బిజెపిలో చేరకుండా కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లానే కూతురితో పార్టీ పెట్టించడం అని రఘునందన్ తెలిపారు. ఇలా కేసీఆర్ బిఆర్ఎస్ ను వీడేవారిని తన కూతురు పెట్టే కొత్తపార్టీలోకి పంపిస్తాడని అన్నారు 

45
కేసీఆర్ కొడుకువైపా? కూతురువైపా?
Image Credit : our own

కేసీఆర్ కొడుకువైపా? కూతురువైపా?

ఇలా కేసీఆర్ ఇటు కొడుకుకు అప్పగించిన పార్టీ బిఆర్ఎస్, అటు కూతురితో పెట్టించే కొత్తపార్టీకి లాభం చేసేలా వ్యవహరిస్తారన్నది రఘునందన్ వాదన. ఈ రెండిట్లో ఏ పార్టీ గెలిచినా అధికారం తన ఇంట్లోనే ఉంటుందని... సీఎం అయ్యేది కల్వకుంట్ల ఇంటి బిడ్డలేనని కేసీఆర్ భావిస్తున్నట్లు బిజెపి ఎంపీ మాటలు చెబుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పటికే దూరంగా ఉంటున్న కేసీఆర్ తెరవెనకుండి తన బిడ్డల రాజకీయ భవిష్యత్ కోసం పనిచేయనున్నారన్నమాట. అంటే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, కూతురు కవిత ఇద్దరివైపు ఉన్నట్లే.

55
కవిత కాంగ్రెస్ వైపు చూస్తుందా..?
Image Credit : our own

కవిత కాంగ్రెస్ వైపు చూస్తుందా..?

మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి మెళ్లిగా దూరమవుతున్న కవిత కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లోని ముఖ్య నేతల ద్వారా ఇప్పటికే కవిత ప్రయత్నాలు చేస్తున్నారని... ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి చెంతకు కూడా చేరిందని తెలుస్తోంది. ఇటీవల డిల్లీ పర్యటనలో సీఎంతో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా అదిష్టానంతో కవిత కాంగ్రెస్ చేరాలనుకుంటున్న ప్రతిపాదనపై చర్చించినట్లు సమాచారం. అంతా సజావుగా సాగిపోతే కవిత కాంగ్రెస్ లో చేరతారని... జూన్ 2న దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ మరో ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత బిఆర్ఎస్ లోనే కొనసాగుతారా? సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? కాంగ్రెస్ లో చేరి తండ్రి, సోదరుడికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
కల్వకుంట్ల కవిత
తెలంగాణ
భారత రాష్ట్ర సమితి
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Kcr-MLC Kavita: మా డాడీ దేవుడు...కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి..ఎమ్మెల్సీ కవిత!
Recommended image2
కవిత సీఎం సీటుపై కన్నేసారా..? అందుకే అన్నను టార్గెట్ చేసారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved