తెలంగాణ ఆలయంలో ఇటలీ ఆర్మీ బ్యాడ్జీలు.. అసలు ఎలా వచ్చాయి.?
చరిత్ర ఎన్నో వింతలను తనలో దాచుకుంటుంది. కాల గర్భంలో గతించిపోయిన కొన్ని విశేషాలు ఆడపాదడప వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వింత వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా వింత.? దాని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

nizamabad
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బీజోరా గ్రామంలో ఉన్న బేజా మహాదేవి ఆలయంలో బుధవారం రోజున ఆశ్చర్యపరిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆలయంలో ఇటాలియన్ ఆర్మీకి చెందిన రెండు బ్యాడ్జిలు (చిహ్నాలు) కనిపించాయి. ఈ బ్యాడ్జిలు ఇంతకాలంగా ఆలయ జాతర సమయంలో వాడుతూ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇవి విదేశీ ఆర్మీకి సంబంధించినవని ఎవరికీ తెలియలేదు.
representative image
ఈ విషయం న్యూస్ తెలంగాణ హిస్టరీ (NTH) బృందం పరిశీలించడంతో బయటపడింది. ఆలయ ట్రస్టీ వేముగంటి (జగం) రాజేశ్వర్ వారి ఆహ్వానంతో NTH బృందం ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ ఆలయంలో ఉన్న రెండు బ్యాడ్జులను గుర్తించి వాటిని వీడియో తీసి రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌కు పంపారు.
Temple
తదుపరి పరిశోధనలో ఆ బ్యాడ్జిలు రెండూ ఇటాలియన్ ఆర్మీకి చెందినవని స్పష్టమైంది. అందులో ఒకటి "ఆర్టిలరీ రెజిమెంట్"కు సంబంధించిన కాలనియల్ హెల్మెట్ బ్యాడ్జ్, మరోది "కావలరీ క్యాప్ బ్యాడ్జ్" అని NTH బృందం గుర్తించింది. ఈ రెండూ రెండవ ప్రపంచ యుద్ధానికి చెందినవే. ఈ బ్యాడ్జిలు సుమారు 8 సెంటీమీటర్ల పొడవులో ఉంటాయి. అవి ఆర్మీ అధికారుల్లో 'కెప్టెన్' హోదాను సూచించేవి.
representative image
ఇవి హిందూ మత సంప్రదాయానికి సంబంధం లేకపోయినా, గ్రామ జాతరలో భాగంగా మేళం ఊరేగింపు సమయంలో రథంపై ఈ బ్యాడ్జిలను ప్రతిష్టించటం అనాదిగా కొనసాగుతోందట. ఈ విషయంపై మాట్లాడిన NTH బృంద సభ్యుడు కంకనాల రాజేశ్వర్ మాట్లాడుతూ – "ఇటాలియన్ ఆర్మీకి చెందిన ఈ బ్యాడ్జిలు బీజోరా గ్రామానికి ఎలా వచ్చాయో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు" అన్నారు.