- Home
- Telangana
- IMD Cold Waves : తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాల్లో గడ్డకట్టే చలి, బిఅలర్ట్
IMD Cold Waves : తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాల్లో గడ్డకట్టే చలి, బిఅలర్ట్
IMD Cold Waves : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇకపై టెంపరేచర్ సింగిల్ డిజిట్ కు తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి
IMD Cold Waves : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో రాత్రి, తెల్లవారుజామున ఎముకలు కొరికే చలిపెడుతోంది. మొంథా తుపాను వర్షబీభత్సం తర్వాత మొదలైన చలి ఇవాళ (నవంబర్ 8న) తారాస్థాయికి చేరింది. ఇకపై ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని తెలంగాణ, వైజాగ్ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణను వణికిస్తున్న చలి
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్నిరోజులు వర్షాలు కురవగా ఇప్పుడు చలితీవ్రత పెరిగి పొగమంచు కురుస్తోంది. ఉదయం, రాత్రి సమయాల్లో స్వెట్టర్లు, టోపీలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. పొగమంచులో రోడ్డు, ముందున్న వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఆసక్తికర విషయం ఏంటంటే రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో నమోదవుతున్నాయి... పటాన్ చెరు ఈక్రిశాట్ ప్రాంతంలో ఇవాళ (నవంబర్ 8, శనివారం) 14 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక బేగంపేటలో 16.9, హయత్ నగర్ 17, హకీంపేట 17.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక జిల్లాల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14.2, మెదక్ లో 15, నిజామాబాద్ లో 16.8, మహబూబ్ నగర్ లో18.5, రామగుండంలో 19.6, ఖమ్మంలో 19.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 20 డిగ్రీ సెల్సియస్ కు అటుఇటుగా ఉష్ణోగ్రతలున్నాయి.
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం ఉష్ణోగ్రతలు ( డిగ్రీ సెల్సియస్ లో)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల లో 14.7
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ 14.8
రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 14.8
శంకర్ పల్లిలో 14.9
మొయినాబాద్ 15
సంగారెడ్డి జిల్లా జిన్నారం 15.1
రాజేంద్ర నగర్ 15.3
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 15.3
మల్కాజ్ గిరి 15.7
కుత్బుల్లాపూర్ 15.7
గచ్చిబౌలి 15.9
మారేడుపల్లి 16
రామచంద్రాపురం 16.1
నేరేడ్ మెట్ 17.1
ఆల్వాల్ 17.1
కార్వాన్ 17.5
మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు .. ఈ జిల్లాలకు అలర్ట్ :
తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే పడిపోయాయి... రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ నమోదవుతుందని... ఇలా 23 జిల్లాల్లో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలుంటాయని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శ్వాస సంబంధిత వ్యాదులతో ఇబ్బందిపడేవారితో పాటు చిన్నారులు, ముసలివారు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో చలి పులి
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వైజాగ్ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. నవంబర్ 9న 12 డిగ్రీ సెల్సియస్ నమోదై నవంబర్ 12 నాటికి 10 డిగ్రీ సెల్సియస్, అంతకంటే తక్కువకు అరకులో ఉష్ణోగ్రతలు పడిపోతాయని హెచ్చరించారు. ఇవాళ (శనివారం) అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులలో 15.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ఱోగ్రత నమోదయ్యింది.