MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?

Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?

Cold Free Winter: హైదరాబాద్‌లో ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ మొత్తంగా కూడా ఇలాంటి సరిస్థితులే ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగవచ్చని ఐఎండీ వెల్లడించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాలు పడలేదు.. ఇప్పుడు చలి కూడా ఉండదా? అసలు ఏం జరుగుతోంది?
Image Credit : chatgpt

వర్షాలు పడలేదు.. ఇప్పుడు చలి కూడా ఉండదా? అసలు ఏం జరుగుతోంది?

ఈ సారి పెద్దగా వర్షాలు పడలేదు. వానకాలంలో కూడా ఎండలు మండిపోయాయి. అయితే, ఇప్పుడు వచ్చే శీతాకాలంలో కూడా వేడి నుంచి ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి చలి తీవ్రత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా అక్టోబర్ నెల నుంచి హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. కానీ ఈ సారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రుతుపవనాల లోటుతో మొదలైన సమ్మర్ వాతావరణం
Image Credit : Pixels

రుతుపవనాల లోటుతో మొదలైన సమ్మర్ వాతావరణం

ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల కాలంలో హైదరాబాద్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ భూగర్భ జలాల శాఖ వివరాల ప్రకారం.. ఈ కాలంలో సాధారణంగా నమోదవ్వాల్సిన 627.2 మిమీ వర్షపాతానికి గానూ కేవలం 458.2 మిమీ లేదా 458.5 మిమీ మాత్రమే వర్షం పడింది.

ఇది దాదాపు 27 శాతం వర్షపాత లోటు. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రాబోయే రోజుల్లో నీటి కొరతతో పాటు ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా ఆందోళన కలిగిస్తోంది.

35
ఎల్ నినో అంటే ఏమిటి? ఉష్ణోగ్రతలపై దాని ప్రభావం ఎంత?
Image Credit : Getty

ఎల్ నినో అంటే ఏమిటి? ఉష్ణోగ్రతలపై దాని ప్రభావం ఎంత?

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం ఎల్ నినో వాతావరణ మార్పులు అని ఐఎండీ స్పష్టం చేసింది. సెంట్రల్, ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడమే ఎల్ నినో.

ప్రస్తుతం పసిఫిక్ పరిధిలో ఉన్న బలహీనమైన లేదా బలమైన ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది చివరి నాటికి మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతల నమూనాలలో భారీ మార్పులు వస్తాయి. కాగా, ఇండియన్ ఓషన్ డిపోల్ ప్రస్తుతం న్యూట్రల్ స్థితిలో ఉండి, పోస్ట్ మన్సూన్ సమయంలోనూ అలాగే కొనసాగే అవకాశం ఉంది.

45
అక్టోబర్‌లోనే వేడి సెగలు: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
Image Credit : Getty

అక్టోబర్‌లోనే వేడి సెగలు: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

సాధారణంగా అక్టోబర్ రాగానే ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అప్పుడే విపరీతంగా పెరుగుతున్నాయి. అత్యధిక కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36.5°C నుండి 37°C వరకు నమోదయ్యాయి. తెలంగాణలో శీతాకాలం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

55
తక్కువ వర్షపాతం.. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది?
Image Credit : Getty

తక్కువ వర్షపాతం.. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది?

వాతావరణ శాఖ రిపోర్టుల ప్రకారం.. తెలంగాణలో మొత్తం అక్టోబర్-డిసెంబర్ కాలంలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఈ కాలంలో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు. కానీ తెలంగాణతో పాటు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉండే సూచనలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
వాతావరణం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?
Recommended image2
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image3
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Related Stories
Recommended image1
Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
Recommended image2
WhatsApp Scheduled Messages: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. మెసేజ్‌లు షెడ్యూల్ చేయడం ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved