పాపం పండింది.. ఐబొమ్మ రవికి ఏన్నేళ్ల శిక్ష పడనుందో తెలుసా?
iBomma Ravi: ఐబొమ్మ రవి కేసు విచారణలో ఎన్నో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దమ్ముంటే పట్టుకోండని సవాల్ విసిరి ఇప్పుడు తగిన మూల్యం చెల్లిస్తున్నాడు. కాగా రవికి ఎలాంటి శిక్ష పడనుంది.? అసలు చట్టం ఏం చెబుతోంది ఇప్పుడు తెలుసుకుందాం.

భారత పౌరసత్వం వదులుకున్న రవి
ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి.. 2022లో భారత పౌరసత్వం వదులుకున్నాడు. ఆ తర్వాత సుమారు 80 లక్షలు చెల్లించి కరీబియన్ దేశంలో పౌరసత్వం తీసుకున్నాడు. అప్పటి నుంచి అక్కడే జీవించాడు. ఆ ప్రాంతంలో లగ్జరీ జీవితం గడిపాడని పోలీసులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్, విశాఖలో ఉన్న తన ఆస్తులు అమ్మాలని నిర్ణయించాడు. ఆ పని కోసం మూడురోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చాడు. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు.
iBomma ఎలా నడిపాడు?
రవి టెక్నాలజీలో మంచి నిపుణుడు. DRM హ్యాకింగ్‌తో ఓటిటి కంటెంట్ కాపీ చేసేవాడు. iBomma అనే వెబ్‌సైట్‌ను రూపొందించి లక్షలాది మందికి అందుబాటులో ఉంచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవి దాదాపు 60 పైరసీ సైట్లు నడిపాడు. ఈ అక్రమ పనితో వందల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతో కరీబియన్‌లో భారీ ఖర్చులు పెట్టాడు.
హైదరాబాద్ వచ్చిన వెంటనే అరెస్ట్
నవంబర్ 15న నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రవిని కుకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉండి మొత్తం పైరసీ నెట్‌వర్క్ నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్థానికంగా కొంతమంది అతనికి సహాయం చేశారని, ఇప్పటికే వారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
రవికి ఎలాంటి శిక్ష పడనుంది.?
రవిపై వేసే ప్రధాన కేసులు ఇవి:
1) కాపీరైట్ చట్టం సెక్షన్లు
Copyright Act 1957 – Sections 63, 63A
ఒరిజినల్ కంటెంట్‌ను దొంగిలించడం, అక్రమంగా పంచడం.
శిక్ష: 6 నెలలు నుంచి 3 సంవత్సరాలు జైలు.
జరిమానా: రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల వరకు.
2) IT Act సెక్షన్లు
Section 66, 66B, 66C, 66D
హ్యాకింగ్, డేటా దోపిడీ, అనధికారిక యాక్సెస్.
శిక్ష: 3–7 ఏళ్ల జైలు.
3) IPC సెక్షన్లు
అబద్ధపు సమాచారంతో ఆదాయం పొందడం.
దోపిడీకి సహాయం చేసిన సహకారులు కూడా IPC సెక్షన్లలోకి వస్తారు.
4) మనీ లాండరింగ్ (ED విచారణ వచ్చే అవకాశం)
పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును విదేశాలకు పంపితే:
PMLA చట్టం ప్రకారం ED కేసు పెట్టవచ్చు.
ఏళ్ల తరబడి విచారణ సాగుతుంది.
అక్రమ ఆస్తుల జప్తు చేసే అవకాశం ఉంటుంది.
పోలీసులు ఇక ఏం చేయనున్నారు?
పోలీసుల తదుపరి చర్యలు ఇలా ఉంటాయి:
* రవి నడిపిన మొత్తం నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడం.
* iBommaకి సంబంధించి ఉన్న సర్వర్లు, డొమెయిన్‌లు ఎవరు ఇచ్చారో గుర్తించడం.
* రవి సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఫాలో చేయడం.
* విదేశీ సహకారం ఉంటే ఇంటర్‌పోల్ సహాయం కోరడం.
* OTT కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కొత్త కేసులు నమోదు చేసే అవకాశం.