- Home
- Telangana
- Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వాటర్ సప్లై కట్. ముందే జాగ్రత్తపడండి
Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వాటర్ సప్లై కట్. ముందే జాగ్రత్తపడండి
Hyderabad: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలతో అంతరాయం ఉండనున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వాటర్ సప్లై ఆగిపోనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మంజీర ప్రాజెక్ట్‌లో లీకేజీలు
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా వస్తున్న ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీలు గుర్తించిన హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) తక్షణ చర్యలు చేపట్టింది. కలబ్గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌లో ఈ లీకేజీలు చోటు చేసుకున్నాయి.
ఒక రోజు నీటి సరఫర నిలిపివేత
మరమ్మత్తు పనుల కోసం సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 25వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు, అంటే 24 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు.. HMWSSB ప్రకటన చేసింది. ఈ సమయంలో సరఫరా ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ప్రభావం చూపే ప్రాంతాలు
ఈ మరమ్మత్తుల కారణంగా హైదరాబాద్‌లో పలు కాలనీలు, డివిజన్లు నీటి సరఫరాలో అంతరాయం ఎదుర్కొంటాయి. వాటిలో ముఖ్యంగా:
* RC పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనగూడ, మియాపూర్
* ఓఅండ్‌ఎం డివిజన్ 22 పరిధిలోని బీరంగూడ, ఆమీన్‌పూర్
* ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2 పరిధిలోని బల్క్ కనెక్షన్స్, ఆఫ్ టేక్ పాయింట్స్
* ఓఅండ్‌ఎం డివిజన్ 6 పరిధిలోని ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్
* ఓఅండ్‌ఎం డివిజన్ 9 పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్
ముందే అలర్ట్ అవ్వండి
వాటర్ బోర్డు ప్రజలను అప్రమత్తం చేస్తూ, 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని ముందే తెలిపింది. అందువల్ల సంబంధిత ప్రాంతాల ప్రజలు అవసరమైనంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఆసుపత్రులు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
భవిష్యత్‌లో మరిన్ని చర్యలు
హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, డిమాండ్ దృష్ట్యా ప్రధాన పైప్‌లైన్లను మరమ్మత్తు చేయడం, కొత్త లైన్లు వేయడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత నీటి సరఫరా వ్యవస్థ మరింత బలపడుతుందని, ఇలాంటి అంతరాయాలు తగ్గే అవకాశం ఉందని HMWSSB ఆశాభావం వ్యక్తం చేసింది.